పోరాటాల గడ్డపై పొలిటికల్ జోష్!
ఏడాదిలో ఎన్నో కీలక రాజకీయ పరిణామాలు
● అభివృద్ధి, సంక్షేమం పేరుతో
కాంగ్రెస్ ముందుకు
● ప్రభుత్వ వైఫల్యాలపై
బీఆర్‌ఎస్ పోరుబాట..
బీజేపీ నేతల ‘మోదీ’ జపం
● కేడర్‌ను కాపాడుకునే పనిలో
సీపీఐ, సీపీఎంలు
అన్ని పార్టీల టార్గెట్ – 2025
ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఈ ఏడాది రాజకీయంగా కీలక పరిణామాలు చోటుచేసుకున్నాయి. గత సంవత్సరం డిసెంబర్‌లో వెలువడిన అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు కాంగ్రెస్‌లో జోష్ నింపగా.. బీఆర్‌ఎస్‌కు చేదు అనుభవాన్ని మిగిల్చాయి. 12 స్థానాల్లో కాంగ్రెస్ 10 గెలుపొందగా.. స్టేషన్‌ఘన్‌పూర్ నుంచి బీఆర్‌ఎస్ అభ్యర్థిగా గెలిచిన కడియం శ్రీహరి హస్తం గూటికి చేరారు. దీంతో జనగామ స్థానం ఒక్కటే గులాబీ పార్టీ ఖాతాలో మిగలడం గమనార్హం. ఈ ఏడాది మేలో జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో రెండుకు రెండు స్థానాలను కాంగ్రెస్ కై వసం చేసుకుంది. సీఎం రేవంత్‌రెడ్డి ఉమ్మడి జిల్లాలో మూడుసార్లు పర్యటించి అభివృద్ధికి రూ.6,500 కోట్ల నిధులు విడుదల చేశారు.
– వివరాలు 8లోu
Comments
Please login to add a commentAdd a comment