పర్యావరణమే మనుగడకు మూలం
‘పర్యావరణ పరిరక్షణ అందరి బాధ్యత’ అక్కడక్కడా ఈ నినాదం చూస్తూ ఉంటాం. మీరో మొక్క నాటకపోయినా పర్లేదు. ‘పర్యావరణాన్ని కాపాడండి’ అంటూ ప్రచారం చేయకపోయినా పర్లేదు. మరింత కలుషితం చేయకుండా ఉంటే చాలు. సిగరేట్లు తాగడం, ప్లాస్టిక్ బాటిళ్లను వినియోగించి పడేయడం. విచ్చలవిడిగా పాలిథిన్ వినియోగించడం. ఇలాంటివి చేయకుండా ఉంటే పర్యావరణానికి మేలు చేసినవారే.
‘కొత్త’ కలలు కందామా..కల అంటే నిద్రలో వచ్చేది కాదు. నిద్రపోనివ్వకుండా చేసేది. కలలు కనండి. వాటిని సాకారం చేసుకోండి.
– మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం
కుంచిత భావన మనసుకే కానీ..
ఊహకు కాదు.. కాస్త పెద్ద కలలు కందాం. ‘నేస్తమా.. బిగ్ డ్రీమ్’..
– ప్రముఖ రచయిత జిడ్డు కృష్ణమూర్తి
అందరి జీవితంలోనూ న్యూ ఇయర్ వస్తుంది. కొందరేమో కొత్త అలవాట్లతో ముందుకెళ్తారు. మరికొందరేమో రొటీన్ జీవితానికే అలవాటు పడతారు. కొత్త కలలు మిమ్మల్ని విజయానికి దగ్గర చేస్తాయి. మీకు సరికొత్త ఉత్సాహాన్నిస్తాయి. మీ అలవాట్లలో స్వల్ప మార్పులు మిమ్మల్ని అందరిలో ప్రత్యేకంగా నిలబెడతాయి. 2025 లో ఈ 5 సూత్రాలు పాటిస్తే ఉన్నత శిఖరాలకు చేరొచ్చని మానసిక వికాస
నిపుణులు అంటున్నారు.
– సాక్షి ప్రతినిధి, వరంగల్/
హన్మకొండ కల్చరల్
నూతన సంవత్సరం..ఆనంద జీవితం
విజయానికి పంచ సూత్రాలు
ఉద్యోగం, ఉపాధితో మెరుగైన జీవనం
ముందస్తు అప్రమత్తతతో సైబర్ మోసాలకు దూరం
పాత జ్ఞాపకాలను మరిచి కొత్త ఆశయాలతో ముందుకు..
బైబై 2024– వెల్‌కమ్ –2025
కొత్త కలలు కందాం. సరికొత్తగా అడుగులు వేద్దాం. ఇన్నాళ్లు ఒక లెక్క. ఇకపై ఒక లెక్క. నువ్వేంటో నిరూపించుకునే రోజొకటి రానే వచ్చింది. హ్యాపీ న్యూ ఇయర్ అంటూ.. అందరికీ విష్ చేయడం కాదు. నీ జీవితంలో ఎంత హ్యాపీ నెస్ ఉందో ఆత్మపరిశీలన చేసుకో. జీవితంలో ఆనందం నిండాలంటే.. నీ విలువ పెంచుకోవాలి. అందుకే ‘లెర్నింగ్ ఈజ్ ఎర్నింగ్’ అన్నారు. ఎంత నేర్చుకుంటే అంత సంపాదిస్తావ్. కొత్త అలవాట్లు నిన్ను సరికొత్తగా చూపిస్తాయ్.
Comments
Please login to add a commentAdd a comment