‘పెన్షనర్లను ఇబ్బందులకు గురిచేయొద్దు’
చిల్పూరు: ప్రభుత్వ ఉద్యోగులుగా పదవీ విరమణ పొందిన పెన్షనర్లను ఇబ్బందులు గురిచేయొద్దని, అలా చేస్తే తగిన గుణపాఠం చెబుతామని 2024 పెన్షనర్ల సంఘం ఉమ్మడి వరంగల్ జిల్లా అధ్యక్షుడు ఇనుగాల ఇంద్రసేనారెడ్డి ప్రభుత్వాన్ని హెచ్చరించా రు. మండల కేంద్రంలో ఆయన మంగళవారం మాట్లాడుతూ 10 నెలలు గడిచినా పెన్షనర్ల పెండింగ్ బిల్లులు చెల్లించక పోవడం ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని తెలియజేస్తోందన్నారు. ప్రభుత్వం ఇలాగే చేస్తే గత ప్రభుత్వానికి పట్టిన గతే పడుతుందని, ఇకనైనా పెన్షనర్లను మానసిక క్షోభకు గురిచేయకుండా వెంటనే దాచుకున్న డబ్బులను చెల్లించాలని కోరారు.
Comments
Please login to add a commentAdd a comment