అడుగడుగునా నిఘా
జనగామ: పాత సంవత్సరానికి వీడ్కోలు పలుకుతూ కొత్త ఏడాదికి స్వాగతం పలికే సమ యంలో అడుగడుగునా పోలీసు నిఘా ఉంటుందని డీసీపీ రాజమహేంద్ర నాయక్ అన్నారు. ఆదివారం డీసీపీ మాట్లాడుతూ సంతోషం వెల్లివిరిసేలా వేడుకలు జరుపుకోవాలని సూచించారు. వెస్ట్‌జోన్ పరిధిలో నేటి (సోమవారం) నుంచి వచ్చే ఏడాది జనవరి 1వ తేదీ వరకు ముమ్మరంగా పోలీసు తనిఖీలు ఉంటాయని చెప్పారు. నూతన సంవత్సర వేడుకలను పురస్కరించుకుని 31వ తేదీన జరుపుకునే ఈవెంట్‌లతో పాటు మైక్‌లకు తప్పనిసరి అనుమతి తీసుకోవాలన్నారు. డీజేలకు పర్మిషన్ ఇచ్చేది లేదన్నారు. వేడుకల పేరిట మహిళలు, విద్యార్థినులకు ఇబ్బంది కలిగించే విధంగా ఈవ్ టీజింగ్‌లకు పాల్పడితే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. పట్టణంలోని ముఖ్య కూడళ్లతో పాటు అన్ని మండలాల పరిధిలో షీటీంల నిఘా ఉంటుందన్నారు. 30వ తేదీ నుంచి జిల్లా వ్యాప్తంగా డ్రంకన్ డ్రైవ్ తనిఖీలు ఉంటాయని, ఎవరూ కూడా మద్యం సేవించి డ్రైవింగ్ చేయరాదన్నారు. ఆర్టీఏ నిబంధనలు ఉన్న వాహనాలు మాత్రమే రోడ్డెక్కాలన్నారు. త్రిపుల్ రైడింగ్ చట్ట రీత్యా నేరమన్నారు. ట్రాఫిక్ సమస్య తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టినట్లు స్పష్టం చేశారు. ప్రశాంత వాతావరణంలో కొత్త సంవత్సర వేడుకలను జరుపుకోవాలని తెలిపారు. ఏసీపీ, సీఐ, ఎస్సైలతో పాటు ట్రాఫిక్ విభాగం, పోలీసు సిబ్బంది తనిఖీలు చేసే సమయంలో సహకరించాలన్నారు. డీసీపీతో ఏసీపీ పార్థసారథి ఉన్నారు.
నేటి నుంచి డ్రంకెన్ డ్రైవ్ తనిఖీలు
మైక్‌లు, ఈవెంట్లకు అనుమతి తప్పనిసరి
మైనర్లకు డ్రైవింగ్ ఇస్తే జైలుకే..
న్యూఇయర్ వేడుకలు ప్రశాంతంగా జరుపుకోవాలి
డీసీపీ రాజమహేంద్రనాయక్
Comments
Please login to add a commentAdd a comment