ప్రభుత్వం చర్చలు జరపాలి
జనగామ రూరల్: ఎస్‌ఎస్‌ఏ ఉద్యోగులకు రేవంత్‌రెడ్డి ఇచ్చిన హామీని వెంటనే అమలు చేయాలని, ఉద్యోగులతో చర్చలు జరపాలని సమగ్ర శిక్ష ఉద్యోగుల సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు జానకీరామ్, సీఆర్పీల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు సహదేవ్ డిమాండ్ చేశారు. కలెక్టరేట్ ఎదుట చేపడుతున్న దీక్షలు ఆదివారం నాటికి 20వ రోజుకు చేరుకుంది. ఈ సందర్భంగా కలెక్టరేట్ వద్ద వంటావార్పు చేసి పాదాచారులకు భోజనాలు అందించి నిరసన వ్యక్తం చేశారు. దీక్షలో హైకోర్టు అడ్వకేట్, సాధిక్ ఫౌండేషన్ చైర్మన్ సాధిక్ అలీ మద్దతు పలికి సంఘీభావం ప్రకటించి ఉద్యోగులకు భరోసా కల్పించారు. సమగ్ర శిక్ష ఉద్యోగులను విద్యాశాఖలో విలీనం చేసి రెగ్యులర్ చేయాల్సిందేనని తెలిపారు. ఇప్పటికై న తెలంగాణ ప్రభుత్వం రాష్ట్ర ప్రతినిధులతో చర్చలు జరిపి సానుకూలంగా స్పందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో సమగ్ర శిక్ష ఉద్యోగ సంఘం జిల్లా బాధ్యులు తాడూరి రమేష్, బైరగోని దయాకర్, శ్రీలత, గోలి రవీందర్ రెడ్డి, అన్నపూర్ణ, భాగ వెంకటేశ్వర్లు, సరేష్, రొయ్యల రాజు, రమ్య తదితరులు పాల్గొన్నారు.
సమగ్ర శిక్ష ఉద్యోగుల సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు జానకీరామ్
కలెక్టరేట్ ఎదుట వంటావార్పు
Comments
Please login to add a commentAdd a comment