హేమాచలక్షేత్రంలో భక్తుల సందడి
మంగపేట: ములుగు జిల్లా మంగపేట మండల పరిధిలోని మల్లూరు శ్రీ హేమాచల లక్ష్మీనర్సింహస్వామిని దర్శించుకునేందుకు ఆదివారం భక్తులు భారీగా తరలివచ్చారు. ప్రభుత్వ, ప్రైవేట్ ఉద్యోగులు ఉదయాన్నే బస్సులు, కార్లు, ఆటోలు ఇతర వాహనాల్లో గుట్టపైకి చేరుకున్నారు. దీంతో దైత అ మ్మవారు(వనదేవత), ఆలయ ప్రాంగణంలోని క ల్యాణ మండపంతో పాటు పవిత్ర చింతామణి జలపాతం వద్ద పుణ్యస్నానాలు ఆచరించేందుకు వచ్చి న భక్తులతో సందడి నెలకొంది. స్వయంభూ స్వా మివారిని దర్శించుకునేందుకు రాష్ట్రంలోని వివిధ సుదూర ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులతో పాటు మేడారం వనదేవతలను దర్శించుకున్న భక్తులు సైతం హేమాచలున్ని దర్శించుకునేందుకు ఆలయానికి తరలిరావడంతో ఆలయ ప్రాంతంలో సందడి నెలకొంది. ఉదయం 10నుంచి 12 గంటల వరకు ఆలయ పూజారులు, పవన్‌కుమార్ ఆచార్యులు, శేఖర్‌శర్మ స్వామివారికి ప్రత్యేక అర్చనలు జరిపించి పట్టు వస్త్రాలతో అలంకరించారు.
Comments
Please login to add a commentAdd a comment