‘హబ్’ సేవలకు అంతరాయం ఉండదు
జనగామ: జిల్లా ప్రభుత్వ జనర ల్ ఆస్పత్రికి అనుబంధంగా ఉన్న తెలంగాణ డయాగ్నోస్టిక్(రక్త పరీక్షల కేంద్రం) సెంటర్ సేవలకు అంతరాయం ఉండ దు.. నిరంతరం కొనసాగుతా యని జిల్లా వైద్యాధికారి(డీఎంహెచ్‌ఓ) డాక్టర్ మల్లికార్జున్‌రావు అన్నారు. డయాగ్నోస్టిక్ సెంటర్‌లోని జనరేటర్ మూలన పడగా.. కరెంటు అంతరాయం తలనొప్పిగా మారింది. సెల్‌ఫోన్ లైట్ల సహాయంతో విధులు నిర్వర్తించాల్సిన పరిస్థితుల్లో హబ్ టెక్నీషియన్లు గోస పడుతున్నారు. దీనిపై ‘పరీక్షలకే పరీక్ష’ శీర్షికన సోమవారం ‘సాక్షి’లో ప్రచురితమైన కథనానికి స్పందించిన కలెక్టర్ రిజ్వాన్ బాషా.. డీఎంహెచ్‌ఓ, మెడికల్ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ గోపాల్‌రావును వివరణ కోరారు. రక్త పరీక్ష ల సమయంలో సాంకేతిక సమస్యలు ఉత్పన్నం కావొద్దని ఆదేశించారు. ఈ మేరకు డీఎంహెచ్‌ఓ డయాగ్నోస్టిక్ సెంటర్‌కు వెళ్లి రిపేరుకు వచ్చిన జనరేటర్, ఇతర సమస్యలు తెలుసుకున్నారు. రోజు వారీగా రక్త పరీక్షలు, వాటికి సంబంధించిన కెమిక ల్స్, ఖర్చు తదితరాల గురించి ఆరా తీశారు. అనంతరం మల్లికార్జున్‌రావు మాట్లాడుతూ సెంటర్ నిర్వహణ పూర్తిగా డీఎంఈ పరిధిలోకి వస్తుందని, ఇందుకు సంబంధించి ఉత్తర్వులు వచ్చాయన్నారు. నిర్వహణ, రిపేర్లు తదితర ఖర్చులను జిల్లా ఆస్పత్రి నిధుల నుంచి వెచ్చించాల్సి ఉంటుందని, అయినప్పటికీ తాము ప్రత్యేకంగా దృష్టి సారిస్తూ సేవల కు ఇబ్బంది కలుగకుండా నిత్యం పర్యవేక్షిస్తామని చెప్పారు. రెండు రోజుల్లో జనరేటర్ మరమ్మతుకు సంధించి పనులు పూర్తి చేయిస్తామన్నారు.
రెండు రోజుల్లో జనరేటర్ మరమ్మతు..
డీఎంహెచ్‌ఓ మల్లికార్జున్‌రావు
Comments
Please login to add a commentAdd a comment