బోనమెత్తిన సమగ్ర శిక్ష ఉద్యోగులు
జనగామ రూరల్: సమగ్ర శిక్ష ఉద్యోగులు న్యాయమైన డిమాండ్లు నెరవేర్చాలని కోరుతూ కలెక్టరేట్ ఎదురుగా చేపట్టిన నిరవధిక దీక్షలు సోమవారం కొనసాగాయి. ఈ సందర్భంగా సంఘం జిల్లా అధ్యక్షుడు తాడూరు రమేశ్ ఆధ్వర్యాన సుమారు 200 మంది మహిళా ఉద్యోగులు బోనాలతో ఆర్టీసీ చౌరస్తా వరకు డప్పు చప్పుళ్లు, పోతరాజుల విన్యాసాలు, దేవతా మూర్తుల వేషధారణలతో ర్యాలీగా వెళ్లి నిరసన తెలిపారు. అనంతరం ఆర్టీసీ చౌరస్తా నుంచి నేరుగా బతుకమ్మకుంట శ్రీ విజయదుర్గామాత ఆలయానికి చేరుకుని అమ్మవారికి బోనాలను సమర్పించా రు. కార్యక్రమంలో సంఘం బాధ్యులు దయాకర్ గౌడ్, గోరంట్ల యాదగిరి, బక్కం రాజకుమార్, రొయ్యల రాజు, హరిప్రసాద్, వెంకటేశ్వర్లు, రమేశ్, మహాలక్ష్మి, ప్రశాంతి, నీరజ, రాణి, సుకన్య, పుష్పలత, శోభ, అన్నపూర్ణ, రమ్య, మహాలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment