ప్లాస్టిక్‌ రహిత పట్టణంగా జనగామ | - | Sakshi
Sakshi News home page

ప్లాస్టిక్‌ రహిత పట్టణంగా జనగామ

Published Tue, Dec 31 2024 1:40 AM | Last Updated on Tue, Dec 31 2024 1:40 AM

ప్లాస్టిక్‌ రహిత పట్టణంగా జనగామ

ప్లాస్టిక్‌ రహిత పట్టణంగా జనగామ

జనగామ: పట్టణాన్ని ప్లాస్టిక్‌ రహితంగా తీర్చిదిద్దడంలో ప్రతీ ఒక్కరి భాగస్వామ్యం అవసరమని మున్సిపల్‌ కమిషనర్‌ వెంకటేశ్వర్లు అన్నారు. ఆయన ఆదేశాల మేరకు వార్డు ప్రత్యేక అధికారి పులి శేఖర్‌ ప్లాస్టిక్‌ కవర్ల వినియోగాన్ని నిషేధిస్తున్న ట్లు 11 దుకాణాలకు ముందస్తు నోటీసులు ఇచ్చా రు. పట్టణంలో 112 దుకాణాలు ఉన్నాయి. ఈ సందర్భంగా కమిషనర్‌ మాట్లాడుతూ వ్యాపార, వాణిజ్య సంస్థలు ఇక నుంచి ప్లాస్టిక్‌ కవర్లు విక్రయించొ ద్దని, అదే సమయంలో ప్రజలు వాటిని వినియోగించవద్దని అన్నారు. ప్రమాద రహిత బ్యాగులను మాత్రమే వాడాలని సూచించా రు. ప్లాస్టిక్‌ కవర్లు విక్రయించిన వారికి రూ.5వేల నుంచి రూ.25వేల వరకు జరిమానా విధించడ మే కాకుండా అవసరమైతే షాపును సీజ్‌ చేస్తామని అన్నారు.

11 దుకాణాలకు ముందస్తు నోటీసులు

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement