వ్యవసాయంలో డ్రోన్ల వినియోగం పెరుగుతుంది
జఫర్‌గఢ్: వ్యవసాయంలో అనేక మార్పులు వస్తున్నాయి.. వచ్చే రెండు మూడేళ్లలో డ్రోన్ల వినియో గం పెరిగి తక్కువ శ్రమతో సులభంగా పంటలు పండించవచ్చని వ్యవసాయ శాస్త్రవేత్త డాక్టర్ ఉమారెడ్డి అన్నారు. ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం వరి పరిశోధన సంస్థ, ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం వరంగల్ ఆధ్వర్యాన మండల పరిధి రఘునాథ్‌పల్లిలో సోమవారం డ్రోన్ ద్వారా వరి సాగుపై రైతులకు క్షేత్ర స్థాయిలో అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఉమారెడ్డితోపాటు శాస్త్రవేత్తలు వర్మ, కిరణ్ బాబు దిలీప్‌కుమార్, ఓంప్రకాశ్, రైతులు సోమిరెడ్డి, కృష్ణరెడ్డి, ఎల్లారెడ్డి పాల్గొన్నారు.
వ్యవసాయ శాస్త్రవేత్త డాక్టర్ ఉమారెడ్డి
Comments
Please login to add a commentAdd a comment