పాలకుర్తి టౌన్: గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయానికి నాణ్యమైన విద్యుత్ అందించేందుకు సబ్‌సేష్టన్ల నిర్మాణాలు చేపట్టామని విద్యుత్ శాఖ చీఫ్ ఇంజనీ ర్ రాజ్ చౌహన్ అన్నారు. మండల పరిధి తొర్రూరు(జె)లో చేపట్టిన 33/11 కేవీ సబ్‌సేష్టన్ నిర్మాణ పనులు పూర్తి కావడంతో సోమవారం టెక్నికల్ చార్జ్ ప్రారంభించారు. సాంకేతిక సమస్యలను గుర్తించడంతోపాటు ప్రమాదాల నివారణకు ముందస్తుగా సబ్‌సేష్టన్‌లో 5 ఎంవీఏ సామర్థ్యం కలిగిన పవర్ ట్రాన్స్‌పార్మర్ చార్జ్ చేశామన్నారు. డీఈ రాంబాబు, విజయ్‌కుమార్, గణేష్, ఏడీఈ శ్రీనివాస్, ఏఈలు బోయిని సత్తయ్య, ఆవిరినేని రణధీర్, సబ్ ఇంజనీరు రామకృష్ణ, లైన్ ఇన్‌స్పెక్టర్ కాంతయ్య, లైన్‌మెన్లు వెంకటేశ్వర్లు, రాజలింగం పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment