ఖానాపురం: పాకాలలో పక్షులకు ఆహారమైన చేపల వేటను నిషేధించాలని రిటైర్డ్ డీఎఫ్‌ఓ పురుషోత్తం, పర్యావరణ పరిరక్షణ ఐక్యవేదిక అధ్యక్షుడు, ఔల్స్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు నాగేశ్వర్‌రావు, శ్యాంసుందర్ కోరారు. జాతీయ పక్షి దినోత్సవాన్ని పురస్కరించుకుని పాకాలలో ఆదివారం బర్డ్, నేచర్ వాక్ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పాకాలలో ప్లాస్టిక్‌ను నిరోధించాలని, ప్లాస్టిక్‌ను అటవీ ప్రాంతంలోకి వెళ్లనీయకుండా జాగ్రత్తలు పాటించాలన్నారు. పక్షులను వీక్షించడానికి బైనాక్యులర్స్, టెలిస్కోప్స్ ఏర్పాటు చేయాలని చెప్పారు. స్వదేశీ, విదేశీ పక్షుల ఆవాసానికి నిలయంగా ఉంటున్న పాకాలలో వసతులు కల్పించాలని కోరారు.
Comments
Please login to add a commentAdd a comment