సీఎంను కలిసిన ఎమ్మెల్యే యశస్వినిరెడ్డి
పాలకుర్తి టౌన్: సీఎం అనుమల రేవంత్‌రెడ్డిని ఆదివారం పాలకుర్తి ఎమ్మెల్యే మామిడాల యశస్వినిరెడ్డి, కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్‌చార్జ్ ఝాన్సీరెడ్డి, రాజేందర్‌రెడ్డి దంపతులు సీఎం నివాసంలో కలిశారు. సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపి పాలకుర్తి నియోజకవర్గ అభివృద్ధి సంబంధించిన కీలకమైన అంశాలను చర్చించారు. నియోజకవర్గ అభివృద్ధికి పూర్తి సహకారం అందిస్తామని సీఎం హామీ ఇచ్చినట్లు ఎమ్మెల్యే తెలిపారు.
ఆదర్శప్రాయుడు వివేకానంద
జనగామ రూరల్: నేటి సమాజానికి ఆదర్శప్రాయుడు స్వామి వివేకానంద అని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు కేవీఎల్‌ఎన్ రెడ్డి అన్నారు. ఆదివారం మండల అధ్యక్షుడు లద్దునూరి మహేష్ ఆధ్వర్యంలో వివేకానంద జయంతి సందర్భంగా ఆయన చిత్ర పటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షుడు మార్క ఉపేందర్, మండల ప్రధాన కార్యదర్శి బండ శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు. అలాగే ఫ్రెండ్స్ యూత్ ఆధ్వర్యంలో ప్రభుత్వ ఆస్పత్రిలో యువత రక్తదానం నిర్వహించారు.
అంతర్జాతీయ
ఒలింపియాడ్‌కు దివిజ
దేవరుప్పుల : స్థానిక బాలయేసు ఇంగ్లిష్ మీ డియం హైస్కూల్‌కు చెందిన నాలుగో తరగతి విద్యార్థిని ఐ.దివిజ ఇంటర్నేషనల్ ఒలింపియాడ్–2 పరీక్షకు అర్హత సాధించినట్లు పాఠశాల కరస్పాండెంట్ బ్రదర్ జేసురాజు తెలిపారు. ఇటీవల జాతీయ గణిత ఒలింపియాడ్‌లో ప్రతిభ పరీక్షలో 96 మంది పాల్గొనగా 15 గోల్డ్‌మెడల్ సాధించారన్నారు. ఈ క్రమంలోనే సోప్ ఒలింపియాడ్ 27 వార్షికోత్సవం పురస్కరించుకొని నిర్వహించిన పరీక్షలో దివిజ అంతర్జాతీయ ఒలింపియాడ్ లెవల్–2 కు ఎంపికవడంతో ఆయన అభినందనలు తెలిపారు. పాఠశాలలో క్షేత్రస్థాయిలో ఉపాధ్యాయుల గణిత బోధన ఫలితంగా తమ పాఠశాల విద్యార్థులు ప్రతిభ కనబరిచారని పేర్కొన్నారు.
ఖోఖో పోటీలకు రెఫరీగా రమేశ్
వరంగల్ స్పోర్ట్స్: న్యూ ఢిల్లీలో మొదటిసారిగా నిర్వహించనున్న అంతర్జాతీయ ఖోఖో చాంపియన్‌షిప్ పోటీల రెఫరీగా హనుమకొండ డీఎస్‌ఏ కోచ్ రాజారపు రమేశ్ ఎంపికయ్యారు. ఈ మేరకు ఖోఖో ఫెడరేషన్ ఆఫ్ ఇండియా అధ్యక్ష, కార్యదర్శులు సుధాన్షు మిట్టల్, ఎంఎస్ త్యాగీ ఉత్తర్వులు జారీ చేసినట్లు ఆదివారం సంయుక్త ప్రకటనలో తెలిపారు. 23 దేశాల నుంచి 39 జట్లు పాల్గొంటున్న ఈ పోటీలకు రెఫరీగా రమేశ్‌కు అవకాశం దక్కడంపై డీవైఎస్‌ఓ గుగులోత్ అశోక్‌కుమార్ హర్శం వ్యక్తం చేశారు. తన ఎంపికకు సహకరించిన తెలంగాణ ఖోఖో అసోసియేషన్ అధ్యక్షుడు జంగా రాఘవరెడ్డి, నాతి కృష్ణమూర్తి, కసుమ సదానందం, వంగపల్లి సూర్యప్రకాష్, ఉమ్మడి వరంగల్ జిల్లా కార్యదర్శి తోట శ్యామ్‌లకు రమేశ్ ధన్యవాదాలు తెలిపారు.
రామప్పలో పర్యాటకుల సందడి
వెంకటాపురం(ఎం): మండలంలోని చారిత్రక రామప్ప దేవాలయంలో ఆదివారం పర్యాటకుల సందడి నెలకొంది. సంక్రాంతి సెలవులు కావడంతో వివిధ ప్రాంతాల నుంచి పర్యాటకులు కుటుంబ సమేతంగా తరలివచ్చారు. ఈ సందర్భంగా ఓంకారం అలంకరణలో పర్యాటకులకు దర్శనమిచ్చారు. ఆలయ పూజారులు తీర్థప్రసాదాలు అందించి ఆశీర్వదించగా టూరిజం గైడ్‌లు ఆలయ విశిష్టత గురించి పర్యాటకులకు వివరించారు. పర్యాటకులు అధికసంఖ్యలో తరలిరావడంతో రామలింగేశ్వరస్వామిని దర్శించుకునేందుకు అరగంటకు పైగా సమయం పట్టింది. పోలీసులు క్యూలో భక్తులను పంపిస్తూ చర్యలు తీసుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment