సింగరేణి కళాకారులకు జీఎం సన్మానం
భూపాలపల్లి అర్బన్: ఇటీవల పశ్చిమబెంగాల్ రాష్ట్రంలోని ఈసీఐఎల్ కంపెనీలో జరిగిన కోలిండియా స్థాయి సాంస్కృతిక పోటీల్లో పాల్గొని ప్రతిభ కనబరిచి పతకాలు సాధించిన కళాకారులను ఏరియా జనరల్ మేనేజర్ రాజేశ్వర్‌రెడ్డి, అధికారులు శనివారం ఘనంగా సన్మానించారు. కూచిపూడి నృత్యంలో ఆడిచెర్ల శ్రీనివాస్ ప్రథమ స్థానంలో గోల్డ్ మెడల్, భారతీయ జానపద గ్రూప్ డ్యాన్స్‌లో శ్రీనివాస్, ఎం.కేశవులు, యు.సురేష్, జి.రవి, బి.రాజ్‌కుమార్, జె.నరేష్, ఆర్.విజయ్‌కుమార్ తృతీయ స్థానంలో కాంస్య పతకాలు కై వసం చేసుకున్నారు. జీఎం కార్యాలయంలో ఏరియా అధికారులు, కార్మిక సంఘాల నాయకులతో కలిసి సన్మానించి అభినందించారు. ఈ కార్యక్రమంలో అధికారులు కవీంద్ర, జ్యోతి, వెంకటరామిరెడ్డి, మారుతి, భిక్షమయ్య, కార్మిక సంఘాల నాయకులు రాజ్‌కుమార్, మధుకర్‌రెడ్డి పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment