త్వరితగతిన పనులు పూర్తిచేయాలి
పలిమెల: మండలంలోని పలు అభివృద్ధి పనులను త్వరితగతిన పూర్తిచేయాలని అదనపు కలెక్టర్ ఎల్.విజయలక్ష్మి అన్నారు. ఈ సందర్భంగా శనివారం మండల కేంద్రంలోని ఇంటిగ్రేటెడ్ భవన స్థలం, పీహెచ్‌సీ భవనం, జీపీ, అంగన్‌వాడీ భవన నిర్మాణ పనులను ఆమె పరిశీలించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ నూతన భవనాలను త్వరితగతిన పూర్తిచేయించేలా చర్యలు చేపట్టాలని అధికారులకు ఆదేశాలు జారీచేశారు. సర్వాయిపేట గ్రామాన్ని సందర్శించి రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలను అర్హులైన వారికి అందేలా చూడాలని అన్నారు. ఈ కార్యక్రమంలో పంచాయతీరాజ్ ఈఈ వెంకటేశ్వర్లు, డీఈ సాయిలు, ఏఈ రవీందర్, ఎంపీఓ ప్రకాశ్‌రెడ్డి పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment