సీఈఆర్ క్లబ్ పునఃపారంభం
భూపాలపల్లి అర్బన్: ఏరియాలోని సీఈఆర్ క్లబ్‌ను పున:ప్రారఃభించారు. ఏరియా సింగరేణి జనరల్ మేనేజర్ రాజేశ్వర్‌రెడ్డి క్లబ్‌కు మరమ్మతులు చేయించి శనివారం ప్రారంభించా రు. రెండు సంవత్సరాలుగా అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల ఈవీఎంల భద్రత కోసం క్లబ్‌ను ఉపయోగించారు. జిమ్ పరికరాలు విని యోగంలోకి తీసుకువచ్చినట్లు జీఎం తెలి పారు. ఈ కార్యక్రమంలో అధికారులు కవీంద్ర, మారుతి, వెంకటరామిరెడ్డి పాల్గొన్నారు.
ఐఎన్‌టీయూసీ డిప్యూటీ జనరల్ సెక్రెటరీగా సమ్మిరెడ్డి
భూపాలపల్లి అర్బన్: కోల్ మైన్ లేబర్ యూనియన్(ఐఎన్‌టీయూసీ) డిప్యూటీ జనరల్ సెక్రెటరీగా ఏరియాకు చెందిన రత్నం సమ్మిరెడ్డి ఎన్నికయ్యారు. ఈ మేరకు రాష్ట్ర కమిటీ నియామకం చేపట్టగా శనివారం యూనియన్ ప్రధాన కార్యదర్శి, మినిమం వేజేస్ అడ్వైజరీ బోర్డు చైర్మన్ జనక్‌ప్రసాద్ నియామక పత్రం అందజేశారు.
సివిల్ సర్వీస్ ఉద్యోగులకు క్రీడాపోటీలు
భూపాలపల్లి అర్బన్: అఖిల భారత సివిల్ సర్వీస్ ఉద్యోగులు ఈ నెల 23, 24 తేదీల్లో హైదరాబాద్‌లో క్రీడా పోటీలు నిర్వహించనున్నట్లు జిల్లా యువజన క్రీడల శాఖ ఇన్‌చార్జ్ అధికారి రఘు శనివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈ క్రీడా పోటీల్లో పాల్గొనే సివిల్ సర్వీస్ ఉద్యోగులు ఈ నెల 20వ తేదీలోపు డీవైఎస్‌ఓ కార్యాలయంలో సంప్రదించాలని కోరారు.
కళాజాతా
భూపాలపల్లి అర్బన్: గిరిజన ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల పరిధిలోని గ్రామాలలో వ్యాధుల లక్షణాలు, నివారణ చర్యలపై అవగాహన కల్పించేందుకు వైద్యారోగ్యశాఖ ఆధ్వర్యంలో కళాజాత ప్రదర్శనలు ప్రారంభించినట్లు జిల్లా వైద్యారోగ్యశాఖ అధికారి డాక్టర్ మధుసూదన్ తెలిపారు. క్షయ, కుష్ఠు నివారణ, మాతా శిశు సంరక్షణ, వ్యాధి నిరోధక టీకాలు, క్రిమి కీటకాల ద్వారా సంక్రమించే వ్యాధులు, రక్తహీనత, హెచ్‌ఐవీ, ప్రభుత్వ ఆస్పత్రిలో ప్రసవాలు, వ్యాధులు ప్రబలకుండా తీసుకోవాల్సిన జాగ్రత్త చర్యలు పట్ల కళాజాత ద్వారా అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. జిల్లాలో అంబట్‌పల్లి, ఆజాంనగర్, మహాముత్తారం పీహెచ్‌సీల పరిధిలోని 30 గ్రామపంచాయతీలలో కళాజాత కార్యక్రమాలు ఈ నెల 30వ తేదీ వరకు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
సౌత్ జోన్ డైరెక్టర్‌గా శ్రీధర్
భూపాలపల్లి అర్బన్: టెన్నిస్ క్రికెట్ అసోసియేషన్ సౌత్ జోన్ డైరెక్టర్‌గా మండలంలోని గొర్లవీడు గ్రామానికి చెందిన మామిడి శ్రీధర్‌ను నియమించినట్లు ప్రధాన కార్యదర్శి ఆశిష్‌కుమార్ శనివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. టీ10 టెన్నిస్ క్రికెట్ అసోసియేషన్‌లో డైరెక్టర్‌గా నియమించడం పట్ల గ్రామస్తులు సంతోషం వ్యక్తం చేసి భవిష్యత్‌తో మరింత ఉన్నత స్థాయిలో ఉండాలని కోరారు.
హేమాచలక్షేత్రంలో భక్తుల కోలాహలం
మంగపేట: మండల పరిధిలోని మల్లూరు శ్రీ హేమాచల లక్ష్మీనర్సింహస్వామి ఆలయం భక్తజనంతో శనివారం కిటకిటలాడింది. వందల సంఖ్యలో భక్తులు ఆలయానికి తరలిరావడంతో ఆలయ ప్రాంగణంతో పాటు చింతామణి జలపాతం, వనదేవత(దైతఅమ్మవారి) ప్రాంతమంతా సందడిగా మారింది. ఆయా ప్రాంతాల నుంచి కార్లు, ఆటోలు, వివిధ ప్రైవేట్ బస్సులు తదితర వాహనాల్లో ఉదయాన్నే గుట్టపైకి చేరుకున్న భక్తులు ఆలయ సమీపంలోని పవిత్ర చింతామణి జలపాతం వద్ద పుణ్యస్నానాలు ఆచరించి హేమాచల కొండపై ఉన్న ఆలయానికి చేరుకున్నారు. అత్యంత భక్తిశ్రద్ధలతో స్వామివారిని దర్శించుకున్న భక్తులు లక్ష్మీనర్సింహస్వామి, ఆదిలక్ష్మి, చెంచులక్ష్మి అమ్మవార్లకు పూలు, పండ్లు, పట్టు వస్త్రాలు సమర్పించారు. ఆలయ అర్చకులు రాజశేఖర్‌శర్మ కారంపుడి పవన్‌కుమార్ ఆచార్యులు, ఈశ్వర రామానుజదాస్ స్వామివారికి నువ్వుల నూనెతో తిల తైలాభిషేకం, ప్రత్యేక అర్చనలు జరిపించారు.
Comments
Please login to add a commentAdd a comment