ఊహాగానాలకు తెర
గద్వాల ఎంబీ చర్చిలో కొవ్వొత్తులతో కొత్త సంవత్సరానికి స్వాగతం
గద్వాల క్రైం: గద్వాల డీఎస్పీగా విధులు నిర్వర్తిస్తున్న కె.సత్యనారాయణకు స్థానచలనం కల్పిస్తూ మంగళవారం రాష్ట్ర పోలీసుశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. గత ఫిబ్రవరి 16న ఆయన గద్వాల డీఎస్పీగా ఆయన బాధ్యతలు స్వీకరించారు. పార్లమెంట్, ఎమ్మెల్సీ ఎన్నికలను శాంతియుత వాతావరణంలో నిర్వహించేందుకు అవసరమైన చర్యలు తీసుకున్నారు. పలు సమస్యాత్మక కేసులతో పాటు ఎస్సీ, ఎస్టీ కేసుల విచారణ సమర్థవంతంగా నిర్వహించారు. ఉండవెల్లి పీఎస్ పరిధిలో పేకాట కేసు విషయంలో పోలీసు శాఖపై వచ్చిన విమర్శలపై తనదైన శైలిలో స్పందించారు. నిర్లక్ష్యం వహించిన సిబ్బందిపై క్రిమినల్ కేసులు నమోదు చేసి.. విచారణ చేపట్టాల్సిందిగా ఉన్నతాధికారులకు నివేదికలను సైతం అందజేశారు. ఈ మేరకు ప్రత్యేకంగా విచారణ చేపట్టి, బాధ్యులపై శాఖాపరమైన చర్యలు తీసుకున్నారు. ఇదిలా ఉంటే, వివిధ కేసుల విషయంలో రాజకీయ నాయకులు చేసిన సిఫారసులపై స్పందించక పోవడంతో డీఎస్పీపై గుర్రుగా ఉన్నట్లు తెలిసింది. మరోవైపు గద్వాల నియోజక వర్గంలోని ఓ సామాజిక వర్గానికి డీఎస్పీ అనుకూలంగా ఉన్నట్లు ఆరోపణలు సైతం వినిపించాయి. దీంతో మరో వర్గం నాయకులు డీఎస్పీపై పోలీసు ఉన్నతాధికారులకు పలుమార్లు ఫిర్యాదులు చేసినట్లు తెలిసింది. మరోవైపు ఇటీవల మల్దకల్, అయిజ, గద్వాల, ధరూర్‌కు చెందిన ఓ వర్గం నాయకులపై పోలీసులు కేసులు నమోదు చేసి రిమాండ్‌కు తరలించడం.. పదే పదే కేసులు నమోదైన వారిపై రౌడీ షీట్, నిషేధిత మత్తు పదార్థాల కేసులు నమోదు అయిన నేపథ్యంలో నియోజకవర్గ నాయకులతో వ్యతిరేకతకు దారి తీసిందని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో గద్వాల డీఎస్పీ మార్పు త్వరలో ఉంటుందని కొన్ని రోజులుగా ఊహాగానాలు వ్యక్తమవుతున్నాయి. అయితే రాష్ట్రవ్యాప్తంగా ఏఎస్పీల పదోన్నతులు, బదిలీల ప్రక్రియ చేపట్టిన పోలీసుశాఖ.. ఒక్క డీఎస్పీని మాత్రమే గద్వాల నుంచి బదిలీ చేయడం జిల్లాలో చర్చనీయాంశంగా మారింది.
● గద్వాల కొత్త డీఎస్పీగా శ్రీనివాస్ పేరు తెరపైకి వినిపించింది. అయితే చివరకు హైదరాబాద్‌లోని గాంధీనగర్ ఏసీపీగా విధులు నిర్వర్తిస్తున్న వై.మొగులయ్యను గద్వాల డీఎస్పీగా నియమించినట్లు సమాచారం. ఆయన త్వరలోనే బాధ్యతలు స్వీకరించనున్నట్లు తెలిసింది. కాగా, ఇక్కడి నుంచి బదిలీ అయిన కె.సత్యనారాయణను హైదరాబాద్ చీఫ్ కార్యాలయంలో రిపోర్టు చేయాల్సిందిగా ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
సాధారణ బదిలీలో భాగంగానే..
పది నెలలుగా గద్వాల డీఎస్పీగా విధులు నిర్వహించా. పలు సమస్యాత్మక కేసుల విషయంలో ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ముందుకెళ్లాం. అక్రమ దందాల కట్టడి విషయంలో సిబ్బంది కృషి ఉంది. నిబంధనలు ఉల్లఘించిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకున్నాం. పలు సమస్యలపై ఫిర్యాదులు అందిన క్రమంలో తగు చర్యలు చేపట్టాం. సాధారణ బదిలీలో భాగంగానే స్థానచలనం జరిగింది. ఎవరితో భేషజాలు లేవు.
– సత్యనారాయణ, డీఎస్పీ
●
డీఎస్పీ సత్యనారాయణ బదిలీ
రాజకీయ ఒత్తిళ్లతోనే స్థానచలనం?
Comments
Please login to add a commentAdd a comment