గద్వాల: జిల్లా కేంద్రంలో ఇంటిగ్రేటెడ్ కోర్టు భవన సముదాయానికి పీజేపీ క్యాంపులో స్థలాన్ని కేటాయించాలని కోరుతూ గత 14 రోజులుగా న్యాయవాదులు చేపడుతున్న నిరసన దీక్షను మంగళవారం విరమించారు. న్యాయవాదుల డిమాండ్‌ను ఎంపీ మల్లు రవి, మాజీ ఎమ్మెల్యే సంపత్‌కుమార్ సీఎం రేవంత్‌రెడ్డి దృష్టికి తీసుకెళ్తూ లేఖలు రాశారు. దీనిపై సీఎం సానుకూలంగా స్పందించారని.. దీక్ష వెంటనే విరమించాలని ఫోన్‌లో మాజీ ఎమ్మెల్యే సంపత్‌కుమార్ న్యాయవాదులను కోరారు. దీంతో న్యాయవాదులు నిరసన దీక్షను విరమిస్తున్నట్లు ప్రకటించారు. ఈ సందర్భంగా న్యాయవాదులకు సీ్త్రచైతన్య స్రవంతి సంఘం నాయకులు నిమ్మరసం ఇచ్చి దీక్ష విరమింపజేశారు.
Comments
Please login to add a commentAdd a comment