చిక్కులు తొలగేనా..! | - | Sakshi
Sakshi News home page

చిక్కులు తొలగేనా..!

Published Sat, Jan 4 2025 8:37 AM | Last Updated on Sat, Jan 4 2025 8:36 AM

చిక్కులు తొలగేనా..!

చిక్కులు తొలగేనా..!

సాదాబైనామా

దరఖాస్తులు 25,218..

సాదా కాగితాలపై భూములు కొనుగోలు చేసి కాస్తులో ఉంటూ పట్టాలు లేక ఇబ్బందులు పడుతున్న రైతులకు ఉపశమనం కలిగించేందుకు గత ప్రభుత్వం దరఖాస్తులు ఆహ్వానించింది. సాదాబైనామాల క్రమబద్ధీకరణకు 2020 జూన్‌లో ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తులు స్వీకరించింది. ఈ మేరకు ఉమ్మడి మహబూబ్‌నగర్‌ పరిధిలోని ఐదు జిల్లాల్లో 25,218 దరఖాస్తులు వచ్చాయి. కాస్తులో ఉన్నప్పటికీ భూమి అమ్మిన వారి సమ్మతి తీసుకోవాలనే నిబంధన, అమ్మిన వారి పేరున భూమి లేకపోవడం వంటి సమస్యలతో పాటు కోర్టు మధ్యంతర ఉత్తర్వులతో వాటి క్రమబద్ధీకరణకు అడుగులు ముందుకుపడలేదు. తాజాగా ప్రస్తుత కాంగ్రెస్‌ ప్రభుత్వం ధరణి ఇబ్బందులు, సాదాబైనామాల క్రమబద్ధీకరణలో న్యాయపరమైన ఇబ్బందులు లేకుండా భూభారతి పోర్టల్‌, ఆర్వోఆర్‌–2024 చట్టం తీసుకొచ్చే ప్రక్రియకు శ్రీకారం చుట్టింది. నూతన ఆర్వోఆర్‌ చట్టం అసెంబ్లీలో ఆమోదం పొందిన నేపథ్యంలో సాదాబైనామా దరఖాస్తుదారుల్లో ఆశలు రేకెత్తాయి.

మరో 9,263

అర్జీలు పెండింగ్‌..

ధరణిలో 33 రకాల మాడ్యూళ్లు ఉన్నాయి. పట్టాదారు పాస్‌పుస్తకంలో పేర్లు సరిచేయడం, మ్యుటేషన్‌, నాలా, మిస్సింగ్‌ సర్వే నంబర్‌ వంటి సమస్యలను పరిష్కరించుకునేందుకు ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తులకు అవకాశముంది. అయితే కుప్పలు తెప్పలుగా దరఖాస్తులు రావడం, పరిష్కారం కేవలం కలెక్టర్‌ లాగిన్‌లో ఉండడంతో ఎనలేని జాప్యం చోటుచేసుకోవడం దరఖాస్తుదారులకు ఇబ్బందులు తెచ్చిపెట్టింది. అదేవిధంగా పీపీబీ (పట్టాదారు పాసుబుక్కు)లో డేటా కరెక్షన్‌ కోసం వందలాదిగా దరఖాస్తులు వచ్చినా.. చేసే వీలు ధరణి పోర్టల్‌లో లేకపోయింది. ఇలాంటి సమస్యలకు సంబంధించి రెవెన్యూ అధికారుల వద్ద సుమారు 9,263 దరఖాస్తు లు పెండింగ్‌లో ఉన్నాయి. ఈ క్రమంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం తీసుకురానున్న భూభారతి చట్టంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.

సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్‌: భూ వివరాలు పారదర్శకం, సమస్యల పరిష్కారానికి సులువైన మార్గమంటూ గత ప్రభుత్వం 2019లో ధరణి పోర్టల్‌ను తీసుకొచ్చిన విషయం తెలిసిందే. భూముల క్రయవిక్రయాలతో పాటు రికార్డుల నిర్వహణ పారదర్శకంగా ఉండేలా ఆ పోర్టల్‌ను అందుబాటులోకి తెచ్చింది. ఈ మేరకు భూ సమస్యలు పరిష్కారమవుతాయని భావించిన రైతాంగానికి కొత్త చిక్కులు ఎదురయ్యాయి. చాలా గ్రామాల్లో భూ సమస్యలకు పరిష్కారం దొరక్క గొడవలు చెలరేగాయి. పలువురు కేసుల్లో ఇరుక్కుని నానా ఇబ్బందులు పడుతున్న పరిస్థితి నెలకొంది. మండల తహసీల్దార్‌ కార్యాలయాలు, పోలీస్‌స్టేషన్లకు వస్తున్న ఫిర్యాదుల్లో భూసమస్యలు, వివాదాలపైనే ఎక్కువగా ఉండడం గమనార్హం.

‘ధరణి’ సమస్యలకు

పరిష్కారం చూపేనా..

పెండింగ్‌ దరఖాస్తులకు మోక్షం కలిగేనా..

ఉమ్మడి జిల్లాలో 25,218 సాదాబైనామా అర్జీల పెండింగ్‌

ఇతర సమస్యలపై సుమారు 9,263..

మార్గదర్శకాలపై రైతుల్లో ఆసక్తి

ప్రభుత్వ మార్గదర్శకాలు

రాగానే..

భూభారతి పోర్టల్‌కు సంబంధించి ప్రభుత్వం నుంచి ఇంకా మార్గదర్శకాలు రాలేదు. చట్టంగా మారింది. నియమనిబంధనలు రూపొందించాల్సి ఉంది. ప్రభుత్వం దీనిపై కసరత్తు చేస్తోంది. ప్రభుత్వ విధివిధానాల ఆధారంగా సాదాబైనామా దరఖాస్తులను పరిష్కరించే అవకాశం ఉంది. ధరణి పెండింగ్‌ దరఖాస్తులను ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ.. పరిష్కారానికి చర్యలు తీసుకుంటున్నాం. ఇది రెగ్యులర్‌ ప్రక్రియనే.

– మోహన్‌రావు, అదనపు కలెక్టర్‌ (రెవెన్యూ)

‘భూభారతి’పై ఎన్నో ఆశలు

జిల్లాల వారీగా పెండింగ్‌ సమస్యలు ఇలా..

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement