నేటి నుంచి జిల్లాస్థాయి వైజ్ఞానిక ప్రదర్శన
గద్వాలటౌన్: జిల్లాస్థాయి బాల వైజ్ఞానిక ప్రదర్శనకు విద్యాశాఖ అన్ని ఏర్పాట్లు చేసింది. 4, 5వ తేదీ రెండు రోజులు స్థానిక ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాలలో జిల్లాస్థాయి వైజ్ఞానిక ప్రదర్శనలు నిర్వహించనుండగా ఏర్పాట్లను డీఈఓ అబ్దుల్‌ఘనితో పాటు పలువురు సైన్స్ అధికారులు, జీహెచ్‌ఎంలు శుక్రవారం పరిశీలించారు. జిల్లాలోని 13 మండలాల పరిధిలోని 175 పాఠశాలల నుంచి సుమారు 250 వరకు ప్రయోగాలను విద్యార్థులు ప్రదర్శించనున్నారు. విద్యార్థులకు, ఉపాధ్యాయులకు భోజనం, వసతి సౌకర్యాన్ని ఏర్పాటు చేశారు. సీనియర్, జూనియర్ విభాగాల నుంచి ప్రతి అంశంలో అత్యుత్తమ ప్రదర్శన కనబర్చిన మొత్తం 14 ప్రదర్శనలను రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపిక చేస్తారు. ఇదిలాఉండగా, శనివారం ఉదయం స్థానిక అనంత ఫంక్షన్‌హాల్‌లో జరిగే ప్రారంభోత్సవానికి కలెక్టర్ సంతోష్, ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి, విజయుడు ముఖ్యఅతిథులుగా హాజరుకానున్నారు.
Comments
Please login to add a commentAdd a comment