ఇసుక తీతతో సమస్య తీవ్రం..
తుంగభద్ద నదికి దక్షిణం వైపున ఏపీ ప్రభుత్వం ఇసుక రీచ్‌లు ఏర్పాటుచేసి యంత్రాల ద్వారా ఇసుక తోడుతున్నారు. దీంతో తుమ్మిళ్ల లిఫ్ట్‌కు రావాల్సిన నీరు అటు వైపుగా వెళ్తుండటంతో నష్టం వాటిల్లుతోందని రైతులు వాపోతున్నారు. నదిలో ఇసుక మేటలు తీయడంతో ఎగువ నుంచి వచ్చే నీరు ఏపీ వైపు పరుగులు తీస్తోందని.. భవిష్యత్‌లో తుమ్మిళ్ల లిఫ్ట్‌కు నీరందే అవకాశాలు ఉండవని ఆందోళన చెందుతున్నారు. ప్రస్తుతం మొక్కజొన్న, సీడు జొన్న పంటలు కంకి దశలో ఉన్నాయి. నీటి తడులు అందించకపోతే దిగుబడి తగ్గి నష్టపోతామని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పంటలకు పూర్తిస్థాయిలో సాగునీరందించి ఆదుకోవాలని కోరుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment