పేదలను చదువుకు దూరం చేయొద్దు
అయిజ: మండల కేంద్రంలో ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఏర్పాటుచేయాలని డిమాండ్ చేస్తూ మంగళవారం బీజేపీ నాయకులు స్థానిక జూనియర్ కళాశాల ఆవరణలో ఒక రోజు దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా బీజేపీ జిల్లా అధ్యక్షుడు రామచంద్రారెడ్డి మాట్లాడుతూ.. ఉమ్మడి జిల్లాలోనే అయిజ మండలం పెద్దదని.. ఇక్కడ డిగ్రీ కళాశాల లేకపోవడంతో విద్యార్థులు అనేక ఇబ్బందులకు గురవుతున్నారన్నారు. సుదూర ప్రాంతాలకు వెళ్లి చదువుకోలేక మద్యలోనే చదువు మానేస్తున్నారని తెలిపారు. పేద విద్యార్థులను చదువుకు దూరం చేయొద్దని ప్రభుత్వాన్ని కోరారు. మండల కేంద్రంలో డిగ్రీ కళాశాల ఏర్పాటు చేయకపోతే నిరసన కార్యక్రమాలను ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఇదిలా ఉంటే, కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ మైలురాయిగా నిలిచిపోతుందని అన్నారు. కేంద్ర బడ్జెట్‌పై హర్షం వ్యక్తంచేస్తూ ప్రధాని నరేంద్ర మోదీ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు గోపాలకృష్ణ, భగత్ రెడ్డి, భీమసేన్‌రావు, నాగేశ్వర్ రెడ్డి, వెంకటేష్, లక్ష్మణ్‌గౌడ్, రఘు, శివ, శ్రీను, రాజశేఖర్, శివన్న, నరసింహారావు, మహేష్, ఉపేందర్ రెడ్డి పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment