హోరాహోరీగా బండలాగుడు పోటీలు
అయిజ: మండలంలోని ఉత్తనూరులో ధన్వంతరి వేంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు, రైతు సంబరాలను పురస్కరించుకొని మంగళవారం ఆరు పళ్ల విభాగం వృషభరాజుల బలప్రదర్శన (బండలాగుడు) పోటీలను నిర్వహించారు. వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన వృషభరాజులు బండలాగుడు పోటీల్లో హోరాహోరీగా తలపడ్డాయి. పోటీలను తిలకించేందుకు వివిధ గ్రామాల నుంచి ప్రజలు తరలివచ్చారు. అదే విధంగా బాస్కెట్‌బాల్ టోర్నీ నిర్వహించారు. వివిధ రాష్ట్రాల క్రీడాకారులు బాస్కెట్‌బాల్ పోటీల్లో ఉత్సాహంగా పాల్గొన్నారు.
వేరుశనగ క్వింటాల్ రూ.5,700
గద్వాల వ్యవసాయం: జిల్లా కేంద్రంలోని మార్కెట్‌యార్డుకు మంగళవారం 960 క్వింటాళ్ల వేరుశనగ అమ్మకానికి వచ్చింది. క్వింటాల్ గరిష్టంగా రూ.5,700, కనిష్టంగా రూ.3,500, సరాసరి రూ. 5,169 ధరలు వచ్చాయి. అదే విధంగా 93 క్వింటాళ్ల కందులు అమ్మకానికి రాగా.. గరిష్టంగా రూ.6,868, కనిష్టంగా రూ. 2,029, సరాసరి రూ. 6,709 ధరలు వచ్చాయి.
ముగ్గురికి ఏఎస్‌ఐలుగా పదోన్నతి
మహబూబ్‌నగర్ క్రైం: ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో ముగ్గురు హెడ్‌కానిస్టేబుల్స్‌కు ఏఎస్‌ఐలుగా పదోన్నతి కల్పిస్తూ మంగళవారం జోగుళాంబ జోన్–7 డీఐజీ ఎల్‌ఎస్ చౌహాన్ ఉత్తర్వులు జారీ చేశారు. పదోన్నతి తర్వాత ముగ్గురికి వేరే చోట్ల పోస్టింగ్ ఇచ్చారు. ఏఎస్‌ఐలుగా పదోన్నతి పొందిన వారిలో ఎస్.శ్రీనివాసులు(మహబూబ్‌నగర్), లచ్చునాయక్ (నాగర్‌కర్నూల్), ఏ.ప్రేమ్‌కుమార్ (గద్వాల)కు పదోన్నతి కల్పించారు.
Comments
Please login to add a commentAdd a comment