స్టేషన్ మహబూబ్‌నగర్/ కొల్లాపూర్: వివాహాది శుభకార్యాలకు అద్దె ప్రాతిపదికన ఆర్టీసీ బస్సులు అందజేస్తామని రీజినల్ మేనేజర్ సంతోష్‌కుమార్, కొల్లాపూర్ డిపో మేనేజర్ ఉమాశంకర్ మంగళవారం వేర్వేరు ప్రకటనల్లో తెలిపారు. రీజియన్‌లో పల్లె వెలుగు, ఎక్స్‌ప్రెస్, డీలక్స్, సూపర్ లగ్జరీ బస్సులను అద్దెకు తీసుకోవచ్చన్నారు. ప్రతి కిలోమీటర్‌పై గతంలో కంటే రూ.7 తగ్గింపు ఉందని, 6 గంటల వెయింటింగ్ చార్జీ మినహాయింపు ఉంటుందన్నారు. ప్రైవేట్ వాహనాల కన్నా తక్కువ ధరకు బస్సులు వస్తాయని, డ్రైవర్ బత్తా కట్టనవసరం లేదని, సౌకర్యవంతమైన బీఎస్–6 అధునాతన టెక్నాలజీ ఉన్న కొత్త బస్సులు, చెప్పిన చోట నుంచి ఎక్కడికై నా, ఎన్ని గంటలైనా అద్దెకు తీసుకోవచ్చని చెప్పారు. బస్సులను బుకింగ్ చేసుకోవడానికి డిపోల వారీగా అచ్చంపేట– 99592 26291, గద్వాల– 99592 26290, కల్వకుర్తి– 99592 26292, కొల్లాపూర్– 90004 05878, కోస్గి– 99592 26293, మహబూబ్‌నగర్– 99592 26286, నాగర్‌కర్నూల్– 99592 26288, నారాయణపేట– 99592 26293, షాద్‌నగర్– 99592 26287, వనపర్తి– 99592 26289 నంబర్లను సంప్రదించాలని కోరారు.
రీజినల్ మేనేజర్ సంతోష్‌కుమార్
Comments
Please login to add a commentAdd a comment