చారకొండలో ఇళ్లు కూల్చివేత
చారకొండ: మండల కేంద్రంలో బైపాస్ నిర్మాణానికి అడ్డుగా ఉన్న ఇళ్ల కూల్చివేత ఘటనతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. చారకొండ నుంచి మర్రిపల్లి వరకు జడ్చర్ల– కోదాడ జాతీయ రహదారి–167 కోసం గతంలోనే భూ సేకరణ చేపట్టగా.. అలైన్‌మెంట్ మార్పులో చిన్నపాటి సమస్యలతో రహదారి నిర్మాణం ఆలస్యమైంది. హైవే అధికారులు బైపాస్ నిర్మాణం కోసం భూ సేకరణ చేసి పరిహారం చెల్లించి సర్వే పూర్తిచేశారు. ఈ క్రమంలో మరోసారి మండల కేంద్రంలో ఇళ్లు, ప్లాట్లు, భూమి కోల్పోతున్న గ్రామస్తులు నేరుగా ఉన్న ప్రధాన రోడ్డు గుండానే రహదారి నిర్మాణం చేపట్టాలని, బైపాస్ నిర్మాణం ఆపాలని ఆందోళన చేసినా హైవే అధికారులు పట్టించుకోలేదు. గ్రామస్తుల కోరిక మేరకే బైపాస్ నిర్మాణం చేపట్టామని, ఇందుకు సంబంధించి నష్టపోయన వారందరికీ పరిహారం సైతం చెల్లించామని.. ఇప్పుడు ఆందోళన చేయడం సరికాదని వారు పేర్కొంటున్నారు. అయితే కొద్దిమంది ఒప్పుకోకపోవడంతో పరిహారం చెల్లించలేకపోయారు. తాజాగా మంగళవారం భారీ పోలీస్ బందోబస్తు మధ్య రెవెన్యూ అధికారుల చొరవతో హైవే అధికారులు నాలుగు జేసీబీలతో వచ్చి 29 ఇళ్లను కూల్చివేశారు. దీంతో బాధితులు అడ్డుకొని ఆందోళన చేపట్టగా.. తగిన నష్టపరిహారం ఇప్పిస్తామని అధికారులు హామీ ఇచ్చి, బలవంతంగా ఇళ్లలో ఉన్న సామగ్రిని పునరావాసంగా ఏర్పాటు చేసిన కేంద్రాలకు తరలించారు. కళ్లముందే కట్టుకున్న ఇళ్లు నేలమట్టం కావడంతో కన్నీరు మున్నీరయ్యారు. దీంతో
పటిష్ట బందోబస్తు
ఇళ్ల కూల్చివేతలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా కల్వకుర్తి డీఎస్పీ, వెల్దండ, కల్వకుర్తి సీఐలు, చారకొండ ఎస్‌తోపాటు ఇతర మండలాల ఎస్‌ఐలు, సుమారు 150 మంది పోలీసులతో పటిష్ట బందోబస్తు నిర్వహించారు. ఇళ్లను కూల్చివేస్తున్న సమయంలో బాధితులు ఆందోళన చేయగా వారిని పోలీసులు అడ్డుకున్నారు. గిరిజమ్మ అనే మహిళ తన ఇంటిని కూల్చివేయొద్దని భీష్మించి కూ ర్చోగా మహిళా పోలీసులు ఆమెను బలవంతంగా అరెస్టు చేసి వెల్దండ పోలీస్‌స్టేషన్‌కు తరలించారు.
బైపాస్ నిర్మాణం కోసం రంగంలోకి దిగిన హైవే అధికారులు
పోలీసులను మోహరించి తతంగం పూర్తి
అడ్డుకున్న బాధితులు.. కొద్దిసేపు ఉద్రిక్తత
సర్వం కోల్పోయాం..
ఎంతో కష్టాలకు ఓర్చి ఇల్లు నిర్మించుకున్నాం. జాతీయ రహదారి నిర్మాణం పేరిట బైపాస్ రోడ్డు ఏర్పాటు చేస్తుండటంతో ఇంటితో సహా సర్వం కోల్పోతున్నాం. ప్రభుత్వం ఇచ్చే పరిహారంతో ఎక్కడా ఇల్లు కుట్టుకోలేం. మా బతుకులు చిన్నాభిన్నం అయ్యాయి. బలవంతంగా నన్ను నా కుటుంబాన్ని అరెస్టు చేసి ఇల్లు కూల్చారు. – గిరిజమ్మ, బాధితురాలు
Comments
Please login to add a commentAdd a comment