కాకినాడ సిటీ: తూర్పు, పశ్చిమగోదావరి జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ నియోజకవర్గానికి గురువారం జరగనున్న ఎన్నికల పోలింగ్‌ను పురస్కరించుకొని ఓటుహక్కు వినియోగించుకునేందుకు స్పెషల్ క్యాజువల్ లీవ్ మంజూరు చేస్తూ కలెక్టర్ షణ్మోహన్ సగిలి మంగళవారం ఆదేశాలు జారీ చేశారు. ఈ నియోజక వర్గ ఓటర్లుగా కాకినాడ జిల్లాలో నమోదైన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉపాధ్యాయులు దీన్ని వినియోగించుకోవచ్చు. ప్రైవేట్‌సంస్థల్లో పని చేసే ఈ నియోజకవర్గ ఉపాధ్యాయ ఓటర్లు వారి ఓటు హక్కు వినియోగించుకునేందుకు సంబంధిత యాజమాన్యాలు వెసులుబాటు కల్పిస్తూ 5వ తేదీన పోలింగ్ సమయంలో విధులకు ఒక గంట ఆలస్యంగా హాజరయ్యేందుకు లేదా షిఫ్ట్‌ల అడ్జస్ట్‌మెంటు లేదా కొద్ది సమయం వెళ్లి వచ్చేందుకు అనుమతించాలని కలెక్టర్ ఆదేశించారు. ఎన్నికల పోలింగ్ ప్రక్రియ నిర్వహించే భవనాల్లోని కార్యాలయాలు లేదా సంస్థలకు ఈ నెల 4, 5 తేదీల్లోనూ, ఈ ఎన్నిక కౌంటింగ్ ప్రక్రియ నిర్వహించే భవనాల్లోని కార్యాలయం, సంస్థకు ఈ నెల 9వ తేదీన స్థానిక సెలవు దినాలు ప్రకటిస్తూ కలెక్టర్ షణ్మోహన్ ఉత్తర్వులు జారీ చేశారు.
5న టెన్నిస్ క్రీడాకారుల ఎంపికలు
నాగమల్లితోట జంక్షన్ (కాకినాడ సిటీ): జిల్లా టెన్నిస్ సంఽఘం ఆధ్వర్యంలో ఈ నెల 5న రాష్ట్రస్థాయి పోటీలకు జిల్లా జట్లు ఎంపికను నిర్వహిస్తున్నట్లు సంఘ కార్యదర్శి కె.మోహన్‌బాబు మంగళవారం తెలిపారు. పెద్దాపురంలోని శ్రీప్రకాష్ సినర్జీ పాఠశాలలో ఎంపికలు ఉదయం 9 గంటలకు ప్రారంభమవుతాయన్నారు. బాలుర విభాగంలో 15 మందిని, బాలికల విభాగంలో 15 మందిని, పురుషులు, మహిళల విభాగాల్లో క్రీడాకారులను రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపిక చేస్తామని తెలిపారు. ఎంపికై న క్రీడాకారులు ఈ నెల 20 నుంచి 25 వరకు కాకినాడ సురేష్‌నగర్‌లోని శ్రీప్రకాష్ స్కూల్‌లో జరిగే అంతర్‌జిల్లాల టేబుల్‌టెన్నిస్ పోటీలలో పాల్గొంటారని టేబుల్ టెన్నిస్ సంఘ అధ్యక్షుడు, విజయ్‌ప్రకాష్ పేర్కొన్నారు.
రా రైస్ ఎగుమతి చేయలేం
కలెక్టర్‌కు చాంబర్ వినతి
కాకినాడ: జిల్లా కలెక్టర్ షణ్మోహన్‌ను మంగళవారం చాంబర్ ఆఫ్ కామర్స్ ప్రతినిధులు కలెక్టరేట్‌లో కలిశారు. ఈ సందర్భంగా చాంబర్ ప్రతినిధులు, ఎక్స్‌పోర్టర్స్, స్టీవ్‌డోర్స్ అసోసియేషన్ ప్రతినిధులు తమ సమస్యలను వివరించారు. పోర్టులో ఇప్పుడున్న పరిస్థితుల్లో రారైస్ ఎగుమతి చేయడం అసాధ్యమని వారు కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్లారు. పీడీఎస్ బియ్యం ఎగుమతి చేస్తే అంతటి అన్యాయం మరొకటి ఉండదని, అది రాష్ట్రానికి, దేశానికి మంచిది కాదని చాంబర్ అధ్యక్షుడు బాబు వివరించారు. పీడీఎస్ బియ్యం ఎగుమతి చేసే వారికి చాంబర్ ఎట్టి పరిస్థితుల్లోను మద్దతు ఇవ్వదనే విషయాన్ని అధికారులు గుర్తించాలన్నారు. రా రైస్ ఎగుమతి చేయడంలో ఎదురవుతోన్న ఇబ్బందులతో వాటిని ఆపేయాలనే ఆలోచనతో త్వరలో ఒక నిర్ణయం తీసుకుంటామన్నారు. కలెక్టర్‌ను కలిసిన వారిలో ఎక్స్‌పోర్టర్స్ అసోసియేషన్ సెక్రటరీ వేల్పూరి శ్రీనివాస్, లలితా రైస్ ప్రతినిధులు ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment