ఘనంగా సత్యదేవుని రథోత్సవం
అన్నవరం: రత్నగిరి వాసుడు సత్యదేవుడు, దేవేరి అనంతలక్ష్మీ సత్యవతీదేవి అమ్మవారి రథోత్సవం ఆదివారం ఆలయ ప్రాకారంలో ఘనంగా నిర్వహించారు. ఉదయం 10 గంటలకు రథాన్ని తూర్పు రాజగోపురం ముందుకు తీసుకువచ్చారు. అందులోకి స్వామి, అమ్మవార్ల ఉత్సవ విగ్రహాలను పండితులు వేంచేయించి పూజలు చేశారు. దేవస్థానం ఈఓ వీర్ల సుబ్బారావు దంపతులు కొబ్బరి కాయ కొట్టి రథ సేవ ప్రారంభించారు. ఆలయ ప్రాకారం నాలుగు వైపులా కొబ్బరి కాయలు కొట్టి సేవను కొనసాగించారు. అనంతరం స్వామి, అమ్మవార్లకు నీరాజన మంత్రపుష్పాలు సమర్పించి, ప్రసాదాలు నివేదించి, భక్తులకు పంపిణీ చేశారు. వేద పండితులు గొల్లపల్లి ఘనపాఠి, అర్చకులు ప్రయాగ రాంబాబు, సుధీర్, వెంకట్రావు, ఏఈఓ కృష్ణారావు, సూపరింటెండెంట్ ఐవీ రామారావు, పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. సత్యదేవుడు, అనంతలక్ష్మీ సత్యవతీదేవి అమ్మవారు సోమవారం ముత్యాల కవచాల అలంకరణలో (ముత్తంగి సేవ) భక్తులకు దర్శనమివ్వనున్నారు.
Comments
Please login to add a commentAdd a comment