కాకినాడ – సామర్లకోట మధ్య ట్రాఫిక్ మళ్లింపు
సామర్లకోట: గోతుల పూడ్చివేత పనుల కోసం సోమవారం నుంచి ఈ నెల 11వ తేదీ వరకూ సామర్లకోట – కాకినాడ కెనాల్ రోడ్డులో ట్రాఫిక్ మళ్లిస్తున్నారు. ఆర్‌అండ్‌బీ అధికారుల సూచనల మేరకు సామర్లకోట సీఐ ఎ.కృష్ణభగవాన్ ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. ఈ నెల 3న శ్రీప్రమాదాల రహదారిశ్రీ శీర్షికన శ్రీసాక్షిశ్రీ ప్రచురించిన కథనానికి ఆర్‌అండ్‌బీ అధికారులు స్పందించారు. సంక్రాంతి పండగ సమీపిస్తూంటంతో గోతులు పూడ్చాలని నిర్ణయించారు. ఈ మేరకు ట్రాఫిక్ మళ్లిస్తున్నామని సీఐ తెలిపారు. కాకినాడ నుంచి సామర్లకోట వచ్చే వాహనాలు భానుగుడి సెంటర్, సర్పవరం, అచ్చంపేట, ఉండూరు మీదుగా ప్రయాణించాలి. అలాగే, సామర్లకోట నుంచి కాకినాడ వెళ్లే వాహనాలు ఉండూరు, అచ్చంపేట జంక్షన్, సర్పవరం జంక్షన్ మీదుగా కాకినాడ చేరుకోవాలి. ఈ మేరకు ట్రాఫిక్ ఎస్సై అడపా గరగారావు ఆధ్వర్యాన సిబ్బంది ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ విషయాన్ని వాహన చోదకులు గమనించాలని సీఐ కోరారు.
ఖోఖో వరల్డ్ కప్
అంపైర్‌గా శ్రీనివాస్
కిర్లంపూడి: ఖోఖో వరల్డ్ కప్ పోటీలకు ఆంధ్రప్రదేశ్ నుంచి టెక్నికల్ అఫిషియల్‌గా (అంపైర్) కిర్లంపూడికి చెందిన కర్రి శ్రీనివాస్ (స్పోర్ట్ కోటా రైల్వే ఉద్యోగి) ఎంపికయ్యాడు. ప్రపంచంలో మొదటిసారిగా ఖోఖో వరల్డ్ కప్ పోటీలు ఢిల్లీ ఇందిరాగాంధీ స్టేడియంలో ఈ నెల 13 నుంచి 19వ తేదీ వరకూ జరగనున్నాయి. ఈ పోటీల్లో ప్రపంచంలోని 29 దేశాల నుంచి 29 బాలురు, 29 బాలికల జట్లు పాల్గొంటున్నాయి. ఈ పోటీలకు అంపైర్‌గా ఎంపికై న శ్రీనివాస్‌ను మాజీ మంత్రి, వైఎస్సార్ సీపీ నేత ముద్రగడ పద్మనాభం, పార్టీ ప్రత్తిపాడు నియోజకవర్గ ఇన్‌చార్జి గిరిబాబు, కిర్లంపూడి వైఎంఎస్‌సీ అధ్యక్షుడు పెంటకోట నాగబాబు, తూర్పు గోదావరి జిల్లా కబడ్డీ అసోసియేషన్ మాజీ కార్యదర్శి సూరత్ సత్యనారాయణ, జిల్లా ఖోఖో అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్ చదలవాడ బాబీ, కార్యదర్శి పట్టాభిరామ్, స్థానిక ప్రజాప్రతినిధులు ఆదివారం అభినందించారు.
Comments
Please login to add a commentAdd a comment