కాకినాడ క్రైం: నగరానికి చెందిన ప్రముఖ సాంక్రమిక వ్యాధుల నిపుణుడు డాక్టర్ యనమదల మురళీకృష్ణ వైద్య శిరోమణి అవార్డు అందుకున్నారు. మానవతా స్వచ్ఛంద సేవా సమితి 50వ వార్షికోత్సవం సందర్భంగా అమలాపురంలోని రోటరీ ఫంక్షన్ హాలులో ఆదివారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో డాక్టర్ మురళీకృష్ణకు ఈ అవార్డు బహూకరించారు. సమితి వ్యవస్థాపకుడు ముషిణి రామకృష్ణారావు మాట్లాడుతూ, డాక్టర్ మురళీకృష్ణ కోవిడ్, ఎయిడ్స్ బాధితులకు ఎనలేని సేవలందించారన్నారు. అరుదైన వైద్య రీతులను పరిచయం చేసి, జిల్లాకు కీర్తిప్రతిష్టలను ఇనుమడింపజేశారని కొనియాడారు.
Comments
Please login to add a commentAdd a comment