ఉత్సాహంగా బాడీ బిల్డింగ్ పోటీలు
అమలాపురం టౌన్: జాతీయ యువజన దినోత్సవం సందర్భంగా అమలాపురం గడియారం స్తంభం సెంటర్‌లో ఆదివారం సాయంత్రం మొదలైన యునైటెడ్ డిస్ట్రిక్ట్ జోనల్ బాడీ బిల్డింగ్ పోటీలు అదేరోజు అర్ధరాత్రితో ముగిశాయి. ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలోని అల్లూరి సీతారామరాజు, తూర్పుగోదావరి, కాకినాడ, డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాల నుంచి హాజరైన దాదాపు 200 మంది బాడీ బిల్డర్లు వివిధ కేటగిరీల్లో పాల్గొని తమ కండలను ప్రదర్శించారు. ఈ మేరకు విజేతల వివరాలను జిల్లా బాడీ బిల్డింగ్ అసోసియేషన్ అధ్యక్షుడు వంటెద్దు వెంకన్నాయుడు సోమవారం ఉదయం వెల్లడించారు. ఈ పోటీలకు సంబంధించి బాడీ బిల్డింగ్ టైటిల్ విన్నర్‌గా కాకినాడకు చెందిన ఎం.దుర్గాప్రసాద్, రన్నర్‌గా కాకినాడ జిల్లాకు చెందిన జి.హేమంతకుమార్, ఫిజిక్స్ స్పోర్ట్స్ టైటిల్ విన్నర్‌గా సీహెచ్ ఇళయరాజా, రన్నర్‌గా పి.బాలరాజు నిలిచారు. 55 కిలోల విభాగంలో ఎస్.రమేష్‌రాజు (అల్లూరి సీతారామరాజు జిల్లా), 60 కిలోల విభాగంలో ఎం.దుర్గాప్రసాద్ (కాకినాడ జిల్లా), 65 కిలోల విభాగంలో ఎస్.దిలీప్ (తూర్పుగోదావరి జిల్లా), 70 కిలోల విభాగంలో పి.బాలరాజు (కాకినాడ జిల్లా), 75 కిలోల విభాగంలో పి.శివగణేష్ (కోనసీమ జిల్లా), ప్లస్ 75 కిలోల విభాగంలో జి.హేమంతకుమార్ (కాకినాడ జిల్లా), దివ్యాంగ విభాగంలో జి.మోషే (కోనసీమ జిల్లా), మాస్టర్స్ విభాగంలో బి.శంకర్ (కాకినాడ జిల్లా), 165 బిలో ఫిజిక్ స్పోర్ట్స్ విభాగంలో పి.బాలరాజు (కాకినాడ జిల్లా), 165 యబో ఫిజిక్స్ స్పోర్ట్స్ విభాగంలో సీహెచ్ ఇళయరాజా (కాకినాడ జిల్లా) వరుసగా ప్రథమ స్థానాలు కై వసం చేసుకున్నారు. ఈ పోటీలకు న్యాయ నిర్ణేతులుగా ఎం.పోలయ్య, బి.కృష్ణ, బి.ప్రకాష్, దొమ్మేటి వెంకటరమణ, వై.శ్రీనివాసరావు, ఎంవీ సముద్రం వ్యవహరించారు. విజేతలకు పవర్ లిఫ్టింగ్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు యెనుముల కృష్ణ పద్మరాజు, అమలాపురం హెల్త్ అండ్ ఫిట్‌నెస్ జిమ్ కోచ్ డాక్టర్ కంకిపాటి వెంకటేశ్వరరావు, పోటీల ఆర్గనైజర్ ఆశెట్టి ఆదిబాబు, బాడీ బిల్డింగ్ అసోసియేషన్ గౌరవాధ్యక్షుడు నగభేరి కృష్ణమూర్తి, ఉపాధ్యక్షుడు గారపాటి చంద్రశేఖర్, ముత్తాబత్తుల వెంకటరమణ బహుమతులు అందజేశారు. జిల్లా బాడీ బిల్డింగ్ అసోసియేషన్, అమలాపురం హెల్త్ అండ్ ఫిట్‌నెస్ జిమ్ సంయుక్త ఆధ్వర్యంలో జరిగిన ఈ పోటీల విజేతలకు నగదు పురస్కారాలతో పాటు మెరిట్ సర్టిఫికెట్లు, షీల్డ్‌లు, పతకాలు అందజేశారు.
టైటిల్ విన్నర్‌గా దుర్గాప్రసాద్
విజేతలను ప్రకటించిన
జిల్లా అసోసియేషన్
Comments
Please login to add a commentAdd a comment