అంబాజీపేటలో ఘనంగా ప్రభల తీర్థం
అంబాజీపేట: సంక్రాంతి సందర్భంగా అంబాజీపే ట సెంటర్‌లో ఏటా ముక్కనుమ రోజున నిర్వహించే ప్రభల తీర్థం (చక్ర తీర్థం) గురువారం అత్యంత ఘనంగా జరిగింది. మాచవరంలోని రామ్‌ఘాట్‌లో వేంచేసియున్న శ్రీపార్వతీ రాజేశ్వరస్వామి, కందుల మల్లేశ్వరస్వామి, యువగణపతి ఆలయాల వద్ద నుంచి ప్రభలను పురవీధుల్లో గౌడ యువసేన యువకులు ఊరేగింపుగా అంబాజీపేట సెంటర్‌కు తీసుకొచ్చారు. అక్కడ కొలువుతీరిన ప్రభలను భక్తులు దర్శించుకొని మొక్కులు తీర్చుకున్నారు. సాయంత్రం పెద్ద ఎత్తున జనం తరలిరావడంతో ఆ ప్రాంతం కిటకిటలాడింది. సెంటర్‌లో ఏర్పాటు చేసిన తీర్థానికి మండలంలోని పలువురు తరలివచ్చారు. ఎస్సై కె.చిరంజీవి ఆధ్వర్యంలో పోలీస్ బందోబస్తు నిర్వహించారు. తీర్థం ముగిసిన అనంతరం ప్రభలతో గ్రామోత్సవం నిర్వహించారు. తీర్థంలో ఏర్పాటు చేసిన సాంస్కృతిక ప్రదర్శనలు, సినీ ఆర్కెస్ట్రా పలువురిని అలరించాయి. ఎంపీ గంటి హరీష్ మాధుర్, పి.గన్నవరం ఎమ్మెల్యే గిడ్డి సత్యానారాయణ, ఎంపీపీ దొమ్మేటి వెంకటేశ్వరరావు ప్రభలను దర్శించుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment