మాట్లాడుతున్న ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావు
పెద్దకొడప్‌గల్(జుక్కల్): రానున్న ఐదు సంవత్సరాలల్లో రాష్ట్ర ప్రజలంతా జుక్కల్ నియోజకవర్గ అభివృద్ధి గురించి చర్చించుకునేలా కృషి చేస్తానని జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావు పేర్కొన్నారు. బుధవారం పెద్దకొడప్‌గల్ మండల కేంద్రంలో కాంగ్రెస్ ఆధ్వర్యంలో నిర్వహించిన విజయోత్సవ సభలో పాల్గొని ప్రసంగించారు. జుక్కల్ ప్రజలు 15 ఏళ్ల నుంచి నిర్బంధంలో ఉన్నారని, ఇక్కడున్న ప్రతి పక్షం నేతలు అధికార పక్షం నాయకులతో కలిసి కాంగ్రెస్ కార్యకర్తలకు అన్యాయం చేశారని అన్నారు. జుక్కల్ ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండ చూసుకుంటానని హామీ ఇచ్చారు. మండల అధ్యక్షుడు మహేందర్ రెడ్డి, నాయకులు నాగిరెడ్డి, మోహన్, బస్వరాజ్, తదితరులు పాల్గొన్నారు.
సొంత గూటికి కాటేపల్లి సర్పంచ్
పెద్దకొడప్‌గల్(జుక్కల్): కాటేపల్లి గ్రామ సర్పంచ్ బోధనం విఠల్ బుధవారం మండల కేంద్రంలోని పాపనేశ్వర ఆలయంలో ఏర్పాటు చేసిన సభలో ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావు సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. 2018లో కాంగ్రెస్ పార్టీ బలపర్చిన అభ్యర్థి విఠల్ సర్పంచ్‌గా గెలిచారు.అనంతరం బీఆర్‌ఎస్ పార్టీలో చేరారు. ఇప్పుడు ఎమ్మెల్యే సమక్షంలో సొంత గూటికి చేరారు. ఆయనతో పాటు, సహకార సంఘం డైరెక్టర్లు గోకని గంగాగౌడ్, అబ్బనబోయిన పెంటయ్య, కాటేపల్లి, వడ్లం గ్రామస్తులు కాంగ్రెస్ పార్టీలో చేరారు.
ప్రజాపాలన కార్యక్రమాన్ని
విజయవంతం చేయాలి
మద్నూర్(జుక్కల్): ఈ నెల 28 నుంచి జనవరి 6వ తేదీ వరకు నియోజకవర్గంలో నిర్వహించే ప్రజాపాలన కార్యక్రమాన్ని అధికారులు విజయవంతం చేయాలని జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావు సూచించారు. మండల కేంద్రంలోని రైతు వేదికలో బుధవారం అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ..అభయహస్తంలో భాగంగా మహాలక్ష్మి, గృహజ్యోతి, యువ వికాసం, ఇందిరమ్మ ఇళ్లు, రైతు భరోసా, చేయూత కోసం అన్ని మండలాలు, గ్రామ పంచాయతీలలో దరఖాస్తులు స్వీకరించాలని పేర్కొన్నారు. దరఖాస్తు చేసుకున్న వారికి రసీదు సైతం అందిస్తామన్నారు. కార్యక్రంలో జెడ్పీ సీఈవో సా యాగౌడ్, డీఎల్‌పీవో శ్రీనివాస్, తహసీల్దార్‌లు, ఎంపీడీవోలు, అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
జుక్కల్ ఎమ్మెల్యే
తోట లక్ష్మీకాంతారావు
పెద్దకొడప్‌గల్‌లో కార్యకర్తలతో
సమావేశం
Comments
Please login to add a commentAdd a comment