బైక్‌ను ఢీకొన్న ట్రాలీ ఆటో
● ఒకరి మృతి
నిజామాబాద్ రూరల్: రూరల్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని మల్లారం గండీలో బైక్‌ను ట్రాలీ ఆటో ఢీకొనడంతో ఒకరు మృతిచెందినట్లు రూరల్ ఎస్‌హెచ్‌వో మహ్మద్ ఆరీఫ్ తెలిపారు. వివరాలు ఇలా.. మోస్రా మండలానికి చెందిన కొత్తిమీర్‌కర్ లక్ష్మణ్(23) అనే యువకుడు గురువారం మధ్యాహ్నం బైక్‌పై నిజామాబాద్‌కు వెళ్తుండగా మల్లారం గండీ వద్ద ఓ ట్రాలీ ఆటో ఎదురుగా వచ్చి ఢీకొట్టింది. ఈ ఘటనలో లక్ష్మన్‌కు తీవ్ర గాయాలు కాగా స్థానికులు అతడిని జిల్లా కేంద్ర ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతిచెందాడు. ట్రాలీ ఆటో డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్నట్లు ఎస్‌హెచ్‌వో తెలిపారు. మృతుడి అన్న రాహుల్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
చికిత్స పొందుతూ
ఎంఈవో మృతి
మాచారెడ్డి: పాల్వంచ మండల విద్యాధికారి జెతాలాల్ (58) ఇటీవల అనారోగ్యానికి గురికాగా, గురువారం చికిత్స పొందుతూ మృతిచెందారు. అతడికి రెండు రోజుల క్రితం బ్రెయిన్ స్ట్రోక్ రాగా కుటుంబ సభ్యులు చికిత్స నిమిత్తం హైదరాబాద్‌కు తరలించారు. అక్కడ చికిత్స పొందతూ గురువారం ఉదయం మృతి చెందారు. భవానీపేట తండాలో జరిగిన అంత్యక్రియల్లో డీఈవో రాజు, ఎస్సీ, ఎస్టీ ఉపాధ్యాయ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కొంగల వెంకటి, ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. ఆరెపల్లి ఉన్నత పాఠశాల పీజీ హెచ్‌ఎంగా పనిచేస్తున్న జెతాలాల్ ఇటీవల పాల్వంచ ఎంఈవోగా నియమితులయ్యారు.
బడా పహాడ్ వద్ద గుర్తుతెలియని వ్యక్తి..
వర్ని: మండలంలోని బడా పహాడ్ వద్ద గుర్తుతెలియని వృద్ధుడు మృతిచెందినట్లు వర్ని ఎస్సై రమేష్ గురువారం తెలిపారు. మృతుడికి సుమారు 70 సంవత్సరాల వయస్సు ఉండవచ్చని, గత వారం రోజులుగా బడాపహాడ్ ప్రాంతంలో బిక్షాటన చేస్తున్నాడని తెలిపారు. చలి తీవ్రత ఎక్కువగా ఉండడం లేదా అనారోగ్యంతో మృతిచెంది ఉండవచ్చునని పేర్కొన్నారు. వక్ఫ్ బోర్డు అధికారుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్టు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment