విద్యార్థులు మానసిక ఒత్తిడికి గురికావొద్దు
ప్రభుత్వ మానసిక వైద్యాధికారి రమణ
కామారెడ్డి టౌన్: విద్యార్థులు మానసిక ఒత్తిడికి గురికావొద్దని జిల్లా ప్రభుత్వ మానసిక వైద్యాధికారి జి. రమణ సూచించారు. గురువారం దేవునిపల్లిలోని సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల, కళాశాలలో విద్యార్థులకు మానసిక ఆరోగ్యంపై అవగాహన సదస్సు నిర్వహించి మాట్లాడారు. మానసిక సమస్యలను అధిగమించాలన్నారు. వయసు రీత్యా వచ్చే ప్రేమ సంబంధిత ఆకర్షణలకు గురికావద్దన్నారు. మొబైల్ ఫోన్‌కు బానిసగా మారవద్దని కేవలం సమాచార సేకరణకు మాత్రమే వినియోగించాలని సూచించారు. విద్యార్థులు తప్పుదోవ పడితే చదువుపై శ్రద్ధ తగ్గిపోయి భవిష్యత్తుపై ప్రభావం పడుతుందని వివరించారు. ఆందోళన, నిరాశ, నిస్పృహ, అతి కోపం, నిద్రలేమి, అతి నిద్రలాంటి లక్షణాలు ఉంటే తక్షణమే స్థానిక ప్రభుత్వ ఆస్పత్రి మెడికల్ ఆఫిసర్‌ను, సైక్రియాలజిస్టును సంప్రదించాలని సూచించారు. లేదా 14416 ఉచిత కాల్ సెంటర్‌కు సంప్రదించి కౌన్సిలింగ్ పొందవచ్చన్నారు. ప్రిన్సిపల్ వనితారెడ్డి, జిల్లా సోషల్ వర్కర్ రాహుల్, దేవకృప, విద్యార్థులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment