పర్యావరణ పరిరక్షణలో ముందుంటాం
కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్
కామారెడ్డి క్రైం: పర్యావరణ పరిరక్షణలో కామారెడ్డి జిల్లా ఎప్పుడు ముందు వరుసలో ఉంటుందని కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ అన్నారు. కౌన్సిల్ ఫర్ గ్రీన్ రెవల్యూషన్, తెలంగాణ విద్యా శాఖ సంయుక్తంగా నిర్వహిస్తున్న స్కూల్ ఎర్త్ క్లబ్ యంగ్ ఎర్త్ లీడర్స్ ప్రోగ్రాంలో భాగంగా కామారెడ్డి కలెక్టరేట్‌లో లీడ్ ఎర్త్ లీడర్స్ కాంక్లేవ్ కార్యక్రమాన్ని గురువారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. సీజీఆర్ సంస్థ, విద్యార్థులను భాగస్వాములను చేసి చేపట్టిన పర్యావరణ కార్యక్రమాలను అభినందించారు. సీజీఆర్ అధ్యక్షురాలు లీలా లక్ష్మారెడ్డి, ఆచార్య ఉపేందర్ రెడ్డి, వందేమాతరం రవీంద్రలు పర్యావరణ ఉపన్యాసాలతో విద్యార్థుల్లో చైతన్యం కలిగించారు. డీఈవో రాజు, డీఆర్‌డీవో సురేందర్, ఫారెస్ట్ డివిజన్ ఆఫీసర్ రామకష్ణ, జిల్లా హార్టికల్చర్ ఆఫీసర్ జ్యోతి, డీఏవో తిరుమల ప్రసాద్‌లు హాజరయ్యారు. జిల్లా సైన్‌న్స్ అధికారి సిద్ధిరాంరెడ్డి వ్యాఖ్యాతగా వ్యవహరించారు. సీజీఆర్ వ్యవస్థాపకులు లక్ష్మారెడ్డి, రాష్ట్ర కార్యదర్శి యానాల వెంకట్ రెడ్డి, సభ్యులు పాల్గొన్నారు .
Comments
Please login to add a commentAdd a comment