‘ప్రశాంతంగా ఉండటం అలవర్చుకోవాలి’
కామారెడ్డి టౌన్: ప్రతి ఒక్కరు మానసికంగా ప్రశాంతంగా ఉండటం అలవర్చుకోవాలని మున్సిపల్ చైర్‌పర్సన్ గడ్డం ఇందుప్రియ అన్నారు. గురువారం జిల్లా కేంద్రంలోని కళాభారతిలో మున్సిపల్, బ్రహ్మకుమారీల ఆధ్వర్యంలో రాజయోగ ధాన్య అవగాహన సదస్సును నిర్వహించారు. ఈ సందర్భంగా చైర్‌పర్సన్ మాట్లాడుతూ.. మున్సిపల్‌లో పని చేస్తున్న ఉద్యోగులు, కార్మికులు నిత్యం కాసేపు ధ్యానం చేయాలన్నారు. హైదరాబాద్ ఓం శాంతి ప్రతినిధి అంజలి దీదీ, కామారెడ్డి ప్రతినిధులు రజిని, సంతోషి, చంద్రకళ, అనిల్, జయ, కౌన్సిలర్లు పాల్గొన్నారు.
‘సర్వేలో ఎలాంటి తప్పులు ఉండొద్దు’
గాంధారి(ఎల్లారెడ్డి): ఇందిరమ్మ ఇళ్ల సర్వే ఇంటింటికి తిరిగి పక్కాగా చేపట్టాలని, సర్వేలో ఎలాంటి తప్పులుండొద్దని,నిజమైన అర్హులను గుర్తించాలని అదనపు కలెక్టర్ శ్రీనివాస్ రెడ్డి సూచించారు. గురువారం ఆయన మండలంలో పర్యటించారు. పిష్కిల్‌గుట్ట తండాను సందర్శించి సర్వేను పరిశీలించారు.ఈ సందర్భంగా సిబ్బందికి పలు సూచనలు చేశారు. ఎంపీడీవో రాజేశ్వర్,డీటీ రవి సిబ్బంది ఉన్నారు.
చోరీ సామగ్రి విక్రయించిన వారిపై చర్యలు తీసుకోవాలి
కామారెడ్డి టౌన్: మున్సిపల్‌కు సంబంధించిన బోరు మోటార్లు, విడి భాగాలు, ఎలక్ట్రికల్ మెటీరియల్ తదితర సామగ్రిని దొంగతనంగా విక్రయించిన వ్యక్తులపై చర్యలు తీసుకోవాలని 8, 27, 44వ వార్డుల కౌన్సిలర్లు నిట్టు కృష్ణమోహన్, అపర్ణ, ప్రముఖులు గురువారం మున్సిపల్ కమిషనర్ స్పందనకు ఫిర్యాదు చేశారు. ఎల్లమ్మ సంప్, గడి వాటర్ ట్యాంక్, బుర్రమత్తడి, వాటర్‌వర్క్ కార్యాలయం వద్ద సుమారు 12 ట్రాక్టర్‌ల ట్రిప్పులకు పైగా ఉన్న విలువైన సామగ్రికి ఇటీవల నూతన ఫిల్డర్ బెడ్ వద్దకు చేర్చారని తెలిపారు. అక్కడి నుంచి కొందరు వ్యక్తులు మున్సిపల్ అధికారుల సహకారంతో నిబంధనలకు విరుద్ధంగా దొంగతనంగా విక్రయించారని తెలిపారు. ఈవిషయంపై తక్షణమే విచారణ జరిపి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు.
చికిత్స పొందుతున్న యువకుడు
తాడ్వాయి(ఎల్లారెడ్డి): మండల కేంద్రంలోని పోలీసు స్టేషన్‌లో ఆత్మహత్యకు యత్నించిన గంగాధర్ హైదరాబాద్‌లోని గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నట్లు గ్రామస్తులు గురువా రం తెలిపారు. తాడ్వాయికి చెందిన కీసరి గంగాధర్ బుధవారం మద్యం తాగి పోలీసులు చూస్తుండగానే పోలీసు స్టేషన్ ఆవరణలో ఉన్న చెట్టుపైకి ఎక్కి కిందకి దూకి ఆత్మహత్యకు యత్నించిన విషయం తెలిసిందే. వెంటనే అతడిని పోలీసులు హైదరాబాద్‌కు తరలించ గా, వైద్యులు చికిత్స అందిస్తున్నారన్నారు. తీ వ్రంగా దెబ్బలు తగలడంతో అతడికి ఒక చె య్యి, ఒక కాలు పనిచేయడం లేదని తెలిసింది.
Comments
Please login to add a commentAdd a comment