మధ్యాహ్న భోజనం పరిశీలన
బాన్సువాడ: చిన్న రాంపూర్ కుర్దు ఉన్నత పాఠశాలలో మధ్యాహ్న భోజనాన్ని శుక్రవారం ఎంఈవో పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలని సూచించారు. ప్రతి రోజు శుభ్రమైన కురగాయలను వండాలని అన్నారు. మధ్యాహ్నా భోజనం వండే సమయంలో ఉపాధ్యాయులు పరిశీలించాలని సూచించారు. ఉపాధ్యాయులు నక్క ప్రవీణ్, వెంకటరమణ తదితరులున్నారు.
బీబీపేటలో..
బీబీపేట: మండల కేంద్రంలోని కస్తూర్భా గాంధీ పాఠశాలలో మధ్యాహ్న భోజనాన్ని శుక్రవారం ఎంఈవో అశోక్ పరిశీలించారు. ఎప్పటికప్పుడు కూరగాయలు తీసుకువచ్చి వండాలని పేర్కొన్నారు. ఆయన వెంట పాఠశాల ప్రత్యేకాధికారి వెంకటలక్ష్మి ఉన్నారు.
హనుమాన్ ఆలయంలో
పైడి ఎల్లారెడ్డి పూజలు
కామారెడ్డి టౌన్: జిల్లా కేంద్రంలోని అతి పురాతన కోడూరి హనుమాన్ ఆలయంలో ప్రముఖ శాస్త్రవేత్త, బీజేపీ నేత పైడి ఎల్లారెడ్డి శుక్రవారం పూజలు చేశారు. ఈ మేరకు ఆలయ అభివృద్ధికి రూ. 2లక్షల నిర్మాణ సామగ్రి అందజేస్తానని హామీ ఇచ్చారు. ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఆయనని ఘనంగా సత్కరించారు. వేద పండితుడు ఆంజనేయశర్మ, ప్రతినిధులు నర్సింలు, రమేష్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment