సిరికొండ: మండలంలోని పోత్నూర్ గ్రామానికి చెందిన బొందల మహేష్ అనే వ్యక్తికి నకిలీ బంగారం అంటగట్టిన ముగ్గురిపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై రామ్ శుక్రవారం తెలిపారు. వివరాలు ఇలా.. మహేష్‌కు ఇటీవల రమేష్ అనే గుర్తుతెలియని వ్యక్తి ఫోన్ చేసి మైసూర్‌లో జేసీబీ డ్రైవర్‌గా పని చేస్తున్నానని తెలిపాడు. జేసీబీ తవ్వకాల్లో తనకి ఒక కుండ దొరికిందని, కుండ నిండా బంగారం ఉందని, దాని బరువు మూడు కిలోల వరకు ఉంటుందని తెలిపాడు. ఆ బంగారంను తక్కువ ధరకే ఇస్తానని నమ్మబలికాడు. కావాలంటే వచ్చి దాన్ని చెక్ చేసుకోవచ్చు అని తెలపడంతో మహేష్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం చిత్తూరు జిల్లా మదనపల్లికి వెళ్లాడు. మహే ష్‌కు అతడు ఒక గ్రాము బంగారం ఇవ్వగా చెక్ చేయించగా నిజమైన బంగారంగా తేలింది. దీంతో తన వద్ద ఉన్న బంగారంను రూ.తొమ్మిది లక్షలకు అమ్ముతానని రమేష్ తెలిపాడు. తన వద్ద రూ.ఏడు లక్షలు మాత్రమే ఉన్నాయని మహేష్ చెప్పగా ఆ డబ్బులను తీసుకొని, బంగారం ఇచ్చాడు. అనంతరం ఆ బంగారాన్ని మహేష్ పరీక్షించగా నకిలీదని తేలింది. దీంతో తనని నమ్మించి మోసం చేసిన రమేష్, మరో ఇద్దరిపై మహేష్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment