కేటీఆర్, హరీశ్‌కు జైలు తప్పదు
నిజామాబాద్ సిటీ: బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు కేటీఆర్, హరీశ్‌రావులకు జైలు జీవితం తప్పదని డీసీసీ అధ్యక్షుడు, సహకార యూనియన్ లిమిటెడ్ చైర్మన్ మానాల మోహన్‌రెడ్డి అన్నారు. జిల్లా కేంద్రంలోని కాంగ్రెస్ భవన్‌లో శుక్రవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో నిర్వహించిన ఫార్ములా రేస్‌లో రూ.55 కోట్ల మేర అవినీతి జరిగిందని, తప్పుచేయనప్పుడు కేటీఆర్‌కు భయమెందుకని ప్రశ్నించారు. ఈ కేసులో గవర్నర్ అనుమతితోనే ఎమ్మెల్యే కేటీఆర్‌పై కేసు నమోదుచేశారని తెలిపారు. దీంతో గులాబీనేతలు కాంగ్రెస్‌పైన, సీఎం రేవంత్‌రెడ్డిపైన అనవసర వ్యాఖ్యలు చేస్తున్నారని మండిపడ్డారు. అలాగే అవుటర్ రింగ్‌రోడ్డు అంశంలో హరీశ్‌రావు సైతం జైలుకు వెళ్లక తప్పదన్నారు. ప్రభుత్వానికి రూ.18 వేల కోట్లు వచ్చే ఆదాయాన్ని కేవలం రూ.7,300 కోట్లకు కాంట్రాక్టు ఇచ్చిన హరీశ్‌రావుపై కూడా విచారణ జరుగుతుందన్నారు. తప్పుచేసినట్లు తేలితే ఆయన కూడా జైలుకు వెళ్లక తప్పదన్నారు.
అమిత్‌షా రాజీనామా చేయాలి: తాహెర్‌బిన్ హందాన్, ఉర్దూ అకాడమీ చైర్మన్
రాజ్యాంగ నిర్మాత అంబేడ్కర్‌ను అవమానించేలా పార్లమెంట్‌లో వ్యాఖ్యలు చేసిన కేంద్ర హోంమంత్రి అమిత్‌షా వెంటనే రాజీనామా చేయాలని రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహెర్‌బిన్ హందాన్ డిమాండ్ చేశారు. దేశ ప్రజలందరికీ అమిత్‌షా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. నూడా చైర్మన్ కేశవేణు, నాయకులు అపర్ణ, రత్నాకర్, కేశ మహేష్, వేణురాజ్, సంతోష్, నరేందర్ గౌడ్ లున్నారు.
ఫార్ములా రేస్‌లో రూ.55 కోట్ల అవినీతి
డీసీసీ అధ్యక్షుడు మానాల మోహన్‌రెడ్డి
Comments
Please login to add a commentAdd a comment