భక్తుల కొంగు బంగారం దేవునిపల్లి మల్లన్న
కామారెడ్డి రూరల్: కోరిన కోర్కెలు తీర్చే భక్తుల కొంగు బంగారంగా పేరొందిన దేవునిపల్లి మల్లన్న జాతర ఉత్సవాలు ఈ నెల 21 నుంచి ప్రారంభం కానున్నాయి. కామారెడ్డి మున్సిపల్ పరిధిలోని దేవునిపల్లిలో మల్లన్న జాతరకు సర్వం సిద్ధం అయ్యాయి. నాలుగు రోజుల పాటు గ్రామాభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో ఈ ఉత్సవాలను నిర్వహించనున్నారు. ఆలయాన్ని రంగులు, విద్యుద్దీపాలతో అందంగా అలంకరించారు. ఈ ఉత్సవాలకు జిల్లాలోని ప్రజలు పెద్ద ఎత్తున హాజరై విజయవంతం చేయాలని వీడీసీ అధ్యక్షుడు గూడెల్లి గంగారం, ఉపాధ్యక్షులు వంగ రాహుల్‌కుమార్, నిట్టు లింగారావులు. వీడీసీ ప్రతినిధులు కోరారు.
ముమ్మరంగా చెరకు క్రషింగ్
సదాశివనగర్(ఎల్లారెడ్డి): అడ్లూర్ ఎల్లారెడ్డి గాయత్రి షుగర్స్ ఫ్యాక్టరీలో చెరుకు క్రషింగ్ ముమ్మరంగా కొనసాగుతుంది. గురువారం నాటికి లక్షా 25 వేల 113 టన్నుల క్రషింగ్ జరిగినట్లు ఫ్యాక్టరీ వైస్ ప్రెసిడెంట్ వేణుగోపాల్ రావు తెలిపారు. పర్మిట్ల ఆధారంగా చెరకును గానుగకు తరలిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు.
మల్లన్న జాతరకు సర్వం సిద్ధం
నేటి నుంచి దేవునిపల్లిలో మల్లన్న ఉత్సవాలు
Comments
Please login to add a commentAdd a comment