వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో పలువురి మృతి
వర్ని: మండలంలోని మల్లారం శివారులో ఓ వ్యక్తి బైక్ పైనుంచి పడి మృతిచెందినట్లు ఎస్సై రమేష్ తెలిపారు. వివరాలు ఇలా.. బాన్సువాడకు చెందిన మున్నంగి డానియల్ (30) శుక్రవారం బోధన్ వైపు నుంచి బాన్సువాడకు బైక్‌పై బయలుదేరాడు. మల్లారం అటవీప్రాంతంలో అతడికి కోతుల మంద అడ్డురావడంతో వాటిని తప్పించబోయి, అదుపుతప్పి కిందపడి అక్కడికక్కడే మృతిచెందాడు. మృతుడి తండ్రి రాజేశ్వర్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.
ఎక్స్‌ఎల్‌ను లారీ ఢీకొట్టడంతో..
సదాశివనగర్(ఎల్లారెడ్డి): మండలంలోని కుప్రియాల్ గ్రామ స్టేజీకి సమీపంలో 44వ జాతీయ రహదారిపై శుక్రవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతిచెందినట్లు పోలీసులు తెలిపారు. వివరాలు ఇలా.. సదాశివనగర్‌కు చెందిన కుప్రియాల్ బాబయ్య(68) టీవీఎస్ ఎక్సెల్‌పై గ్రామానికి వస్తుండగా నిజామాబాద్ వైపు నుంచి కామారెడ్డి వైపునకు వెళ్తున్న లారీ వేగంగా ఢీకొట్టడంతో బాబయ్య అక్కడికక్కడే మృతి చెందాడు. కాగా ద్విచక్ర వాహనం లారీకి ఇరుక్కుని సుమారు 10 మీటర్ల దూరం వరకు లాక్కుపోయింది. మృతుడి కుటుంబీకుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్సై రంజీత్ తెలిపారు.
ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో శుక్రవారం జరిగిన రెండు వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో ఇద్దరు వ్యక్తులు మృతిచెందారు. అలాగే బోధన్‌కు చెందిన ఓ వ్యక్తి అమెరికాలో ఇటీవల జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతిచెందాడు.
ఉన్నత విద్య కోసం వెళ్లి.. తిరిగిరాని లోకాలకు..
బోధన్‌టౌన్(బోధన్): పట్టణానికి చెందిన శంకర్, నలినీల దంపతుల కుమారుడు నీరజ్ గౌడ్ (23) ఈనెల 16న అమెరికాలో జరిగిన ఓ రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. మృతుడి బంధువులు తెలిపిన వివరాలు ఇలా.. నీరజ్ గౌడ్ ఉన్నత విద్య కోసం గతంలో అమెరికా వెళ్లాడు. ఈ నెల 16న నిజామాబాద్‌కు చెందిన శ్రీధర్ నాయక్‌తో కలిసి నీరజ్‌గౌడ్ కారులో అమెరికాలోని బ్రిడ్జీపోర్టు ప్రాంతానికి వెళ్లి, తిరిగివస్తుండగా తీవ్రమైన మంచు కురిసింది. దీంతో వారి కారు అదుపు తప్పి రోడ్డు పక్కన నిలిపి ఉన్న పోలీసు పెట్రోలింగ్ కారును ఢీకొట్టింది. ఈఘటనలో నీరజ్ గౌడ్‌కు తీవ్ర గాయాలు అవ్వగా, మిత్రుడు శ్రీధర్‌కు, పోలీసు వాహనంలో ఉన్న సిబ్బందికి సైతం గాయాలు అయ్యాయి. వెంటనే వారిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలిస్తుండగా నీరజ్‌గౌడ్ మార్గమధ్యలోనే మృతి చెందాడు. మరో రెండు నెలల్లో ఉన్నత విద్యను పూర్తి చేసుకొని స్వదేశానికి తిరిగి రావాల్సి ఉండగా తిరిగిరాని లోకాలకు వెళ్లడంతో కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరు అవుతున్నారు. నీరజ్ మృతదేఽహాన్ని స్వదేశానికి రప్పించడానికి కుటంబ సభ్యులు ప్రయత్నాలు చేస్తున్నట్లు మృతుడి బంధువులు వెల్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment