ఆర్టీసీకి మహాలక్ష్మికళ!
శనివారం శ్రీ 21 శ్రీ డిసెంబర్ శ్రీ 2024
– 9లో u
సాక్షి ప్రతినిధి, కామారెడ్డి : నిజామాబాద్ ఆర్టీసీ రీజియన్ పరిధిలో ఆరు బస్సు డిపోలున్నాయి. అన్ని డిపోలలో కలిపి 582 బస్సులున్నాయి. రీజియన్ పరిధిలో ఎక్స్‌ప్రెస్‌లు 114, పల్లె వెలుగులు 317 ఉన్నాయి. పల్లె వెలుగు, ఎక్స్‌ప్రెస్ బస్సుల్లో మహాలక్ష్మి పథకం ద్వారా ఉచిత ప్రయాణానికి ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. గతేడాది డిసెంబర్‌లో ఈ పథకం ప్రారంభమైంది. రాష్ట్ర ప్రభుత్వం మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పించడంతో ఆర్టీసీ పరిస్థితి మెరుగుపడింది. ఏడాది కాలంలో 6 కోట్ల మంది మహిళలు జీరో టికెట్లపై ప్రయాణించారు. వారి ప్రయాణ టికెట్ల విలువ రూ. 223.60 కోట్లు. బస్సు చార్జీ చెల్లించి ప్రయాణించిన వారు 3,10,50,600 మంది ఉన్నారు. వారి ద్వారా రూ.255.71 కోట్ల ఆదాయం వచ్చింది. ఉపాధి కోసం పల్లెల నుంచి పట్టణాలకు వెళ్లే మహిళలకు ఈ పథకం ఒక వరంలా మారింది. అలాగే చదువుల కోసం వెళ్లే ఆడపిల్లలు కూడా ఉచితంగా ప్రయాణం చేసే అవకాశం లభించింది. కొందరు మహిళలు తీర్థయాత్రలకు కూడా వెళ్తున్నారు. భద్రాచలం, వేములవాడ, బాసర, కొమురవెళ్లి తదితర ప్రాంతాల్లోని ప్రముఖ ఆలయాలకు వెళ్లి దర్శనాలు చేసుకుంటున్నారు. పెళ్లిళ్లు, ఫంక్షన్లకు బస్సుల్లోనే ఎక్కువగా ప్రయాణిస్తున్నారు. ఇదే సమయంలో ఆటోవాలాలకు గిరాకీ తగ్గి వారు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కాగా ప్రయాణికుల సంఖ్యకు అనుగుణంగా బస్సులు పెరగకపోవడం సమస్యగా మారింది. ఒక్కో బస్సులో వంద మందికిపైగా ప్రయాణం చేస్తున్నారు. దీంతో ప్రయాణికులతో పాటు ఆర్టీసీ కండక్టర్లు, డ్రైవర్లు కూడా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కనీసం నిలబడడానికి స్థలం కూడా దొరకడం లేదు. కొన్నిసార్లు తోపులాటలతో గొడవలూ జరుగుతున్నాయి. ఆర్టీసీ వైపు ప్రజలు మొగ్గు చూపుతున్న నేపథ్యంలో ప్రభుత్వం బస్సుల సంఖ్యను పెంచాల్సిన అవసరం ఉంది.
బస్సు ఎక్కుతున్న మహిళలు (ఫైల్)
న్యూస్‌రీల్
నష్టాల బాటలో పయనిస్తున్న ఆర్టీసీని మహాలక్ష్మి పథకం ఆదుకుంది. గతేడాది డిసెంబర్ నుంచి ఇప్పటివరకు ఈ పథకం ద్వారా ఉమ్మడి జిల్లాలోని ఆరు బస్‌డిపోల ద్వారా
6 కోట్లకుపైగా మహిళలు ఉచితంగా ప్రయాణించారు. వీరి ద్వారా సంస్థకు
రూ. 223.60 కోట్ల ఆదాయం సమకూరడం గమనార్హం.
ఏడాదిలో 6 కోట్ల మంది
మహిళల ప్రయాణం
సంస్థకు రూ.223.60 కోట్ల ఆదాయం
Comments
Please login to add a commentAdd a comment