వసతిగృహాల పరిసరాలు శుభ్రంగా ఉంచాలి
లింగంపేట: వసతి గృహాల పరిసరాలను ని త్యం శుభ్రంగా ఉంచాలని జెడ్పీ సీఈవో చందర్‌నాయక్ సూచించారు. శుక్రవారం ఆయ న లింగంపేట బీసీ వసతి గృహాన్ని తనిఖీ చేసి మాట్లాడారు. పరిసరాలు పరిశుభ్రంగా లేకపోతే దోమలు, ఈగలు వృద్ధి చెందే అవ కాశాలు ఉన్నాయన్నారు. విద్యార్థులకు పౌష్టికాహారం అందించాలని సూచించారు. జిల్లా లో 18 వసతి గృహాల్లో ప్యూరిఫయర్ యంత్రాలు పనిచేయడం లేదని, కలెక్టర్‌తో చర్చించి మరమ్మతులు చేయిస్తామని పేర్కొన్నారు. కార్యక్రమంలో ఎంపీడీవో నరేష్, ఎంపీవో మలహరి, పంచాయితీ కార్యదర్శి శ్రావణ్‌కుమార్, వార్డెన్ రాజేశ్వర్ ఉన్నారు.
‘హెల్మెట్ ధరించి ప్రాణాలు కాపాడుకోండి’
కామారెడ్డి క్రైం : ‘‘హెల్మెట్ ధరించండి.. ప్రా ణాలు కాపాడుకోండి’’ అంటూ పట్టణ పోలీసులు శుక్రవారం పాఠశాలల విద్యార్థులతో కలిసి వాహనదారులకు అవగాహన కల్పించారు. ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నిబంబధనలు పాటించాలని పట్టణ ఎస్‌హెచోవో చంద్రశేఖర్‌రెడ్డి సూచించారు. చిన్నారులు హెల్మెట్ ధరించిన వారికి గులాబీ పువ్వును బహూకరించారు. కార్యక్రమంలో ట్రాఫిక్ ఎస్సై మ హేష్, పోలీసులు, సిబ్బంది పాల్గొన్నారు.
జిల్లా పశుౖ వెద్యాధికారుల
సంఘం కార్యవర్గం
కామారెడ్డి అర్బన్: జిల్లా పశు వైద్యాధికారు ల సంఘం ఎన్నికలు గెజిటెడ్ అధికారుల సంఘం జిల్లా అధ్యక్షుడు ఆర్.దేవేందర్, ఎన్నికల అధికారి రవికుమార్ పర్యవేక్షణలో శుక్రవారం పాతరాజంపేట డెయిరీలో జరిగాయి. అధ్యక్షుడిగా ఎం.వినీత్‌కుమార్, అసోసియేట్ అధ్యక్షుడిగా యు.శివకృష్ణ, ప్ర ధాన కార్యదర్శిగా ఎ.రవికుమార్, కార్యాల య కార్యదర్శిగా ఆర్.రమేష్, కోశాధికారిగా టి.రామచందర్, ఉపాధ్యక్షులుగా వి.రవి, పండరీనాథ్, ఎన్.అనిల్‌కుమార్, మౌనికారె డ్డి, సంయుక్త కార్యదర్శులుగా సయ్యద్ యూనస్, మణికుమార్, కె.హేమశ్రీ, సీహె చ్.అర్చన, ఆర్గనైజింగ్ కార్యదర్శిగా జైపాల్‌సింగ్, రాష్ట్ర కార్యవర్గసభ్యుడిగా మహేష్ నాయక్, జిల్లా కార్యవర్గసభ్యులుగా శృతిల య, అనూష ఎన్నికయ్యారు.
శాసీ్త్రయ నైపుణ్యాలు
పెంపొందించుకోవాలి
కామారెడ్డి టౌన్: విద్యార్థులు శాసీ్త్రయ నైపుణ్యాలు పెంపొందించుకోవాలని డీఈవో ఎస్.రాజు సూచించారు. తెలంగాణ బయోసైన్స్ ఫోరం జిల్లా శాఖ ఆధ్వర్యంలో శుక్రవారం జిల్లా కేంద్రంలోని సాందీపని డిగ్రీ కళాశాలలో ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు జిల్లా స్థాయి జీవశాస్త్ర ప్రతిభ పరీక్ష నిర్వహించారు. డీఈవో రాజు విజేతలకు సర్టిఫికెట్లు, జ్ఞాపికలను అందజేశారు. సాందీపని కళాశాల డైరెక్టర్ హరిస్మరణ్‌రెడ్డి, జిల్లా సైన్స్ అధికారి సిద్ధిరాంరెడ్డి, బయో సైన్స్ ఫోరం జిల్లా అధ్యక్షుడు ప్రతాప్‌రెడ్డి, ప్రధాన కార్యదర్శి కృష్ణ, కోశాధికారి సురేష్, ఫిజికల్ సైన్స్ ఫోరం అధ్యక్షుడు ప్రతాపరెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
రేపు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి రాక
నిజామాబాద్‌అర్బన్: వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహా ఆదివారం జిల్లాలో పర్యటించనున్నారు. రెంజల్‌లో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం భవనం, జిల్లా కేంద్రంలో మాతా శిశు సంరక్షణ భవనాన్ని ప్రారంభిస్తారని కలెక్టర్ రాజీవ్‌గాంధీ హనుమంతు తెలిపారు. ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలో ఉమ్మడి జిల్లా వైద్య అధికారులతో సమావేశమవుతారని పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment