వంద శాతం ఉత్తీర్ణత సాధించాలి
గాంధారి : ప్రభుత్వ పాఠశాలల్లో పదోతరగతి చదువుతున్న విద్యార్థులు వంద శాతం ఉత్తీర్ణత సాధించే దిశగా కష్టపడాలని కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ సూచించారు. శుక్రవారం ఆయన ఎల్లారెడ్డి ఆర్డీవో ప్రభాకర్‌తో కలిసి పోతంగల్ కలాన్ జెడ్పీ ఉన్నత పాఠశాలను తనిఖీ చేశారు. జెడ్పీ ఉన్నత పాఠశాలలో మ రుగుదొడ్లు, తాగునీటి వసతి, వంట గది, బియ్యంతో పాటు వంటలను పరిశీలించారు. తరగతి గది లో విద్యార్థినికి ఓ ప్రశ్న సంధించగా ఆమె దాన్ని ప రిష్కరించడంతో సంతృప్తి వ్యక్తం చేశారు. జిల్లాలో ని అన్ని పాఠశాలల్లో విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించేలా చర్యలు తీసుకోవాలని డీఈవో రాజుకు సూచించారు. అనంతరం ఆయన ఆరోగ్య ఉప కేంద్రాన్ని తనిఖీ చేశారు. గ్రామంలో నిర్వహిస్తున్న ఇందిరమ్మ ఇళ్ల సర్వేను పరిశీలించారు. అంగన్‌వాడీ కేంద్రాన్ని సందర్శించి చిన్నారులతో సరదాగా మాట్లాడారు. ఓ చిన్నారిని ఎత్తుకుని కేంద్రంలో దారంతో వేలాడదీసిన బొమ్మల పేర్లు అడిగి తెలుసుకున్నా రు. చిన్నారులతో పాటలు పాడించి సంబురపడ్డా రు. గాంధారి జీపీ పరిధిలో నిర్వహిస్తున్న నర్సరీని పరిశీలించారు. కార్యక్రమంలో డీఎంహెచ్‌వో చంద్రశేఖర్, ఎంపీడీవో రాజేశ్వర్, డిప్యూటీ తహసీల్దార్ ర వి, ఎంపీవో లక్ష్మీనారాయణ, ఏవో సంతోష్ తదితరులు పాల్గొన్నారు.
కర్ణంగడ్డ తండావాసుల అసంతృప్తి
పోతంగల్ కలాన్‌లో పర్యటించిన కలెక్టర్‌ను తమ గ్రామానికి రావాల్సిందిగా కర్ణం గడ్డ తండా వాసులు కోరారు. కొందరు కలెక్టర్ కాళ్లు పట్టుకునే ప్రయత్నం చేశారు. దీంతో ఆయన తండాను సందర్శించడానికి సుముఖత వ్యక్తం చేయగా.. అధికారులు సర్దిచెప్పారు. దీంతో కర్ణంగడ్డ తండాకు వెళ్లకుండానే వెనుదిరిగారు. అధికారుల తీరుపై తండావాసులు అసంతృప్తి వ్యక్తం చేశారు. తండాను పరిశీలిస్తే సమస్యలు తెలుస్తాయని, వాటి పరిష్కారంలో అధికారుల నిర్లక్ష్యం బయట పడుతుందని ఇలా చేశారని ఆరోపిస్తున్నారు.
కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్
పొతంగల్ కలాన్ హైస్కూల్ పరిశీలన
Comments
Please login to add a commentAdd a comment