‘సర్కారు వారి పాట’.. వాయిదా
నస్రుల్లాబాద్ : తీసుకున్న అప్పు తీర్చకపోవడంతో రైతు పొలాన్ని వేలం వేయాలని నిర్ణయించారు సహకార బ్యాంకు అధికారులు. రైతు పాక్షికంగా కొంత మొత్తాన్ని చెల్లించడంతో వేలాన్ని వాయిదా వేశారు. వివరాలిలా ఉన్నాయి. అంకోల్ తండాకు చెందిన రైతు అనూష బాయి 2013–14లో నిజామాబాద్ సహకార బ్యాంకు నస్రుల్లాబాద్ శాఖలో భూమి అభివృద్ధి పనులకోసం రూ. 3.70 లక్షలు అప్పు తీసుకున్నారు. బోర్లు ఫెయిల్ కావడం, పంటలు సరిగా పండకపోవడంతో అప్పు తిరిగి చెల్లించలేకపోయారు. అది వడ్డీతో కలిపి రూ. 10.29 లక్షలు అయ్యింది. దీంతో బ్యాంకు అధికారులు ఆమె భూమిని వేలం వేయాలని నిర్ణయించారు. శుక్రవారం పంచాయతీ కార్యాలయంలో వేలానికి ఏర్పాట్లు చేశారు. అయితే రైతు కొంత మొత్తాన్ని చెల్లించడంతో వేలాన్ని వాయిదా వేస్తున్నట్లు బ్యాంకు అధికారులు ప్రకటించారు. రూ. 2 లక్షల అప్పు చెల్లించారని, మిగతా మొత్తాన్ని 15 రోజుల్లో చెల్లిస్తానని ఒప్పుకోవడంతో వేలాన్ని వాయిదా వేశామని డీఆర్‌వోఎస్‌డీ వసంత తెలిపారు. కార్యక్రమంలో స్థానిక బ్యాంకు మేనేజర్ సందీప్, సిబ్బంది నాగభూషణం, భూమేష్, సహకార సంఘాల సీఈవోలు నరేందర్, శ్రీనివాస్, మోహన్, సుధాకర్ తదితరులు పాల్గొన్నారు.
సొసైటీలో పదేళ్ల క్రితం
రూ. 3.70 లక్షల రుణం
వడ్డీతో కలిపి రూ. 10.29 లక్షలకు
చేరిన వైనం
రికవరీకోసం చర్యలు చేపట్టిన
బ్యాంకు అధికారులు
కొంత మొత్తాన్ని చెల్లించడంతో
15 రోజుల గడువిచ్చిన బ్యాంకర్లు
Comments
Please login to add a commentAdd a comment