గెలుపే లక్ష్యంగా కార్యకర్తలు పనిచేయాలి
పిట్లం(జుక్కల్): వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో అందరూ కలిసికట్టుగా పని చేయాలని, బీజేపీ బలపరిచిన అభ్యర్థుల గెలుపే లక్ష్యంగా ఎన్నికలకు వెళ్లాలని ఆ పార్టీ జిల్లా అధ్యక్షురాలు అరుణతార సూచించారు. మండల కేంద్రంలోని బ్రహ్మంగారి ఆలయంలో శుక్రవారం బీజేపీ మండల కార్యవర్గ సమావేశాన్ని పార్టీ మండల అధ్యక్షుడు అభినయ్ రెడ్డి అధ్యక్షతన నిర్వహించారు. సమాశేశానికి ముఖ్య అతిథిగా అరుణతార హాజరై మాట్లాడారు. జిల్లా బీజేపీ ప్రధాన కార్యదర్శి రాము, జిల్లా ఓబీసీ మోర్చా ఉపాధ్యక్షులు అశోక్ రాజ్, మండల ప్రధా న కార్యదర్శి రాజు, నాయకులు అక్షయ పటేల్, జగదీష్, బెజుగం నరసింహులు, అనిల్ రెడ్డి, మాజీ సర్పంచ్ శివాజీ రావ్, తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment