ఖలీల్‌వాడి: హైదరాబాద్‌లో వాణిజ్య సముదాయం ఇప్పిస్తానని నమ్మబలికి ఓ మహిళ వద్ద నుంచి రూ. 25లక్షలు తీసుకొని మోసం చేసిన నిందితుడిని అరె స్టు చేసి, రిమాండ్ పంపినట్లు ఇన్‌చార్జి సీపీ సింధూశర్మ ఒక ప్రకటనలో తెలిపారు. నగరంలోని వినా యక్ నగర్‌కు చెందిన బాధితురాలికి హైదరాబాద్‌లో ని జూబ్లీహిల్స్‌లో ఒక వాణిజ్య దుకాణం ఇప్పిస్తానని అహ్మద్‌ఖాన్ మాయమాటలు చెప్పి, రూ. 25లక్షలు తీసుకున్నాడన్నారు. బాధితురాలు సదరు ప్రదేశానికి వెళ్లి చూడగా అక్కడ ఎలాంటి నిర్మాణం లేకపోవడంతో అహ్మద్ ఖాన్ తనను మోసం చేశాడని గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. డబ్బులు అడిగితే తనను చంపేస్తానని బెదిరించినట్లు బాధితురాలు తెలిపింది. పోలీసులు విచారణ చేపట్టగా నిందితుడు అమాయక ప్రజలను నమ్మించి, మోసం చేస్తున్నాడని తేలిందన్నారు. నిందితుడిని నాలుగో టౌన్ పోలీసులు అరెస్ట్ చేసి, రిమాండ్ తరలించారు.
ఓ మహిళకు రూ.25లక్షలు టోకరా
నిందితుడి అరెస్టు
Comments
Please login to add a commentAdd a comment