పీజీ పరీక్ష కేంద్రాల తనిఖీ
తెయూ (డిచ్‌పల్లి): తెయూలోని ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల పరీక్ష కేంద్రంలో జరుగుతున్న పీజీ పరీక్షలను వర్సిటీ వీసీ యాదగిరిరావు శుక్రవారం తనిఖీ చేశారు. పరీక్షల నిర్వహణ ఏర్పాట్ల పట్ల సంతప్తి వ్యక్తం చేశారు. పీజీ 1వ, 3వ సెమిస్టర్ రెగ్యులర్ (థియరీ, ప్రాక్టికల్), ఐదు సంవత్సరాల ఇంటిగ్రేటెడ్ కోర్సు మొదటి సెమిస్టర్, ఎల్‌ఎల్బీ, ఐఎంబీఏ 7వ, 9వ సెమిస్టర్ పరీక్షలు ప్రశాంతంగా జరిగినట్లు ఆడిట్ సెల్ డైరక్టర్ ప్రొఫెసర్ ఘంటా చంద్రశేఖర్ తెలిపారు. పరీక్షలకు 151 మంది విద్యార్థులకు గానూ 148 మంది విద్యార్థులు హాజరు కాగా ముగ్గురు విద్యార్థులు గైర్హాజరయ్యారని తెలిపారు. అడిషనల్ కంట్రోలర్ సాయిలు, వైస్ ప్రిన్సిపాల్ సత్యనారాయణరెడ్డి పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment