11.5 క్వింటాళ్ల రేషన్ బియ్యం పట్టివేత
గాంధారి(ఎల్లారెడ్డి): మండలంలో అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యాన్ని పట్టుకొని, నిందితులపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై ఆంజనేయులు తెలిపారు. బాన్సువాడకు చెందిన అబ్దుల్ రహీం శుక్రవారం పేట్‌సంగెం నుంచి బొలెరో వాహనంలో 11.5 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని అక్రమంగా తరలిస్తుండగా పోతంగల్ కలాన్ స్టేజీ వద్ద పట్టుకున్నట్లు తెలిపారు. అబ్దుల్ రహీం పేట్‌సంగెంలో బియ్యం దాచి, అక్కడి నుంచి బాన్సువాడ మీదుగా మహారాష్ట్రలోని దెగ్లూర్‌కు తరలిస్తున్నట్లు తెలిపారు. బియ్యం, వాహనాన్ని స్వాధీనం చేసుకున్నామని, బియ్యాన్ని రెవెన్యూ అధికారులకు అప్పగించినట్లు ఎస్సై తెలిపారు.
సిరికొండ మండలంలో..
సిరికొండ: మండల పరిధిలోని మహిపాల్ తండా వద్ద అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యాన్ని పట్టుకున్నట్లు ఎస్సై రామ్ శుక్రవారం తెలిపారు. యాదాద్రి భువనగిరి జిల్లా మరియాల గ్రామానికి చెందిన తేజావత్ అఖిల్ తన బైక్‌పై 180 కిలోల రేషన్ బియ్యంను తరలిస్తుండగా ఎన్‌ఫోర్స్‌మెంట్ డీటీ రవికుమార్‌తో కలిసి పట్టుకొని స్వాధీనం చేసుకున్నట్లు ఎస్సై తెలిపారు. నిందితుడిపై కేసు నమోదు చేసి, బైక్‌ను సీజ్ చేసినట్లు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment