రాజకీయ కక్షతోనే కేటీఆర్‌పై కేసులు
నిజామాబాద్ అర్బన్: రాజకీయ కక్షతోనే బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్‌పై రాష్ట్ర ప్రభుత్వం కేసులు నమోదు చేయిస్తుందని రూరల్ మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ అన్నారు. హైదరాబాద్ అభివృద్ధి కోసమే నాడు మంత్రిగా ఉన్న కేటీఆర్ ఈ–ఫార్ములా రేస్‌ను నిర్వహించారని, ఇందులో ఎలాంటి తప్పు లేకున్నా, కేసు నమోదు చేయడం తగదని అన్నారు. నగరంలోని బీఆర్‌ఎస్ పార్టీ జిల్లా కార్యాలయంలో శుక్రవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈఫార్ములా రేస్‌ను విజయవంతంగా 35 వేల మంది వీక్షించారని పేర్కొన్నారు. కానీ కేటీఆర్‌ను ఏదో రకంగా చిన్నకారణమైన చూపించి జైలులో పెట్టాలని ప్రభుత్వం భావించడం దుర్మర్గామన్నారు. ఆరు గ్యారంటీలు, ఎన్నికల్లో ఇచ్చిన ఇతర హామీలు అమలుచేయకుండ రాష్ట్ర ప్రభుత్వం కక్షసాధింపు చర్యలే ఏజెండగా పెట్టుకోవడం సరైందికాదన్నారు. సీఎం రేవంత్‌రెడ్డి వ్యవహరశైలి కాంగ్రెస్ పార్టీకి ఎంతో నష్టం చేకూరుతుందని విమర్శించారు. జెడ్పీ మాజీ చైర్మన్ దాదన్నగారి విఠల్‌రావు, నుడా మాజీ చైర్మన్ ప్రభాకర్‌రెడ్డి, సుజిత్‌సింగ్‌ఠాకూర్, సూదం రవిచంద్ర, దండు శేఖర్ పాల్గొన్నారు.
హైదరాబాద్ అభివృద్ధి కోసమే
ఫార్ములా రేస్
మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్
Comments
Please login to add a commentAdd a comment